Site icon Prime9

Ram Charan : నాకు నాన్న, బాబాయ్ రెండు కళ్ళు.. విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉంది – రామ్ చరణ్

ram charan interesting words about doing virat kohli biopic

ram charan interesting words about doing virat kohli biopic

Ram Charan : తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా “ఆర్ఆర్ఆర్”. ఈ మూవీ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ ను సాధించి  ఇండియన్ సినిమాకి గర్వకారణంగా నిలిచింది. కాగా ఈ క్రమంలోనే మూవీ యూనిట్ నుంచి వచ్చేస్తున్నారు. కాగా తాజాగా చరణ్, ఉపాసన శుక్రవారం నాడు ఇండియాకు తిరిగివచ్చారు. అయితే నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించే దేశంలోనే అతిపెద్ద స్పీకర్ షిప్ సమ్మిట్ ప్రోగ్రాంలో చరణ్ పాల్గొనబోతుండటంతో నేరుగా ఢిల్లీకే వెళ్ళాడు. ఈ మేరకు సమ్మిట్ లో మాట్లాడుతూ చరణ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఈ ఇంటర్వ్యూలో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చరణ్ ని ఇంటర్వ్యూ చేశారు. ఈ సంధర్భంగా చరణ్ తన ఫ్యామిలీ గురించి, ఆర్ఆర్ఆర్ గురించి చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగానే మా నాన్న, పవన్ కళ్యాణ్ బాబాయ్ తర్వాత నేను ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చేది రాజమౌళికే. మా నాన్న, పవన్ బాబాయ్ నాకు రెండు కళ్ళ లాంటివాళ్లు. ఆస్కార్ గెలిచాక మా నాన్న నన్ను చూడటానికి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చేశారు అని తెలిపాడు.

నాన్న తర్వాత నా ఫేవరెట్ హీరో ఆయనే – చరణ్ (Ram Charan)

అలానే త్వరలో రంగస్థలం కంటే బెటర్ క్యారెక్టర్ చేయబోతున్నానని.. సెప్టెంబర్ లో షూట్ మొదలవ్వబోతుందని చరణ్ తెలిపాడు. ఇక నెపోటిజం గురించి మాట్లాడుతూ.. ఎవరైనా స్టార్స్ సక్సెస్ అయ్యారు అంటే ఓన్లీ ట్యాలెంట్, హార్డ్ వర్క్ మాత్రమే కారణం. నెపోటిజం అస్సలు కారణం కాదు అని అన్నాడు చరణ్. అలాగే ఇండియన్ సినిమాలో మన చరిత్ర, మన మట్టి స్టోరీలు చెప్పాలి. తెలుగు, హిందీ, ప్రాంతీయ సినిమాలు పోయాయి. ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా ఒక్కటే అని అన్నాడు. ఇక ర్యాపిడ్ ఫైర్ లో యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కియారా తన బెస్ట్ కో స్టార్ అని, చిరంజీవి తర్వాత సల్మాన్ ఖాన్ చిన్నప్పటి నుంచి ఫేవరేట్ హీరో అని, స్విట్జర్లాండ్, రాజస్థాన్ ఫేవరేట్ ప్లేసెస్ అని, హార్స్ రైడింగ్, సినిమాలు చూడటం హాబీలు అని చెప్పాడు. అలాగే స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేయాలని ఉందని చరణ్ అనగా రాజ్‌దీప్ సర్దేశాయ్ విరాట్ కోహ్లీ బయోపిక్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది అని అంటే చరణ్ ఆఫర్ వస్తే కచ్చితంగా చేస్తాను అని అన్నారు.

తన హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఓ హాలీవుడ్ సినిమాలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయి. అది ఓకే అయ్యేదాకా నేను ఏం చెప్పను. నాకైతే హాలీవుడ్ లో నటించాలని ఉంది. భవిష్యత్తులో కచ్చితంగా నటిస్తాను అని అన్నారు. ప్రోగ్రాం అయిపోయాక కేంద్రమంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవితో కలిసి చరణ్ కలిశారు. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడంతో అమిత్ షా.. ఆర్ఆర్ఆర్ యూనిట్ తరుపున చరణ్ కు శాలువా కప్పి సన్మానించారు. అయితే చరణ్, చిరంజీవి కలిసి అమిత్ షాను కలవడంతో ఇటు సినీ పరిశ్రమలోనే కాక రాజకీయాల్లో కూడా చర్చగా మారింది. కాగా ఈ ఫోటోలను ట్విట్టర్ వేదకగా చిరంజీవి షేర్ చేస్తూ.. థ్యాంక్యూ అమిత్ షాజీ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

 

 

Exit mobile version