Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు రజినీ. ఆయన స్టయిల్, డైలాగ్ డెలివరీ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా నిలిచి విదేశాల్లో కూడా మంచి మార్కెట్ ఉన్న స్టార్ అంటే రజినీ అనే చెప్పాలి. ఇండియన్ సూపర్ స్టార్‌గా 4 దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమకు రజినీకాంత్ సేవలను అందిస్తున్నారు. అయితే ఇటీవల రజినీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పోరంకిలో గల అనుమోలు గార్డెన్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా సూపర్ స్టార్ రజినీ కాంత్ హాజరయ్యి తెలుగులో ధారాళంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు సీనియర్ ఎన్టీఆర్‌తో తనకున్న అనుభవాలను పంచుకుంటూ అప్పటి మధుర జ్ఞాపకాలెన్నింటినో ఈ వేదికగా సూపర్ స్టార్ నెమరువేసుకున్నారు. అదే విధంగా ఈ వేడుకలకు నందమూరి బాలకృష్ణ, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పొగిడారు. అయితే ఆ కారణంగా వైకాపా నేతలు వరుసగా రజినీకాంత్ ని టార్గెట్ చేస్తూ ఒకరి తర్వాత ఒకరుగా వరుసగా విమర్శలు గుప్పించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ వైకాపా నేతలపై, వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. వైసీపీ రజినీకాంత్ కి సారి చెప్పాలని #YSRCPApologizeRajini అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు పెడుతున్నారు. తమదైన శైలిలో వైసీపీ నేతలపై విరిచుకుపడుతూ గట్టిగా తరవల్లింగ్ చేస్తున్నారు. మరి దీనిపై వైసీపీ నాయకులు మళ్ళీ స్పందించి ఏమైనా మాట్లాడతారేమో చూడాలి. అలానే తెదేపా అధినేత చంద్రబాబు కూడా వైసీపీ నేతలపై మండిపడ్డారు. నోటి దూల నేతలను అదుపులో పెట్టుకోవలంటూ జగన్ ను విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ కూడా చేశారు.
ఆ ట్వీట్ లో.. అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని.. అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్ గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు.. ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని…అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ @rajinikanth గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ… pic.twitter.com/CjyhyviDNb
— N Chandrababu Naidu (@ncbn) May 1, 2023