Site icon Prime9

Rudhrudu Movie: గూస్ బంప్స్ తెప్పిస్తున్న”రుద్రుడు” మూవీ గ్లింప్స్

rudhrudu movie glimpse

rudhrudu movie glimpse

Rudhrudu Movie: దక్షిణభారత ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ ఓ వైపు కొరియోగ్రఫీ, మరోవైపు దర్శకుడిగా ఇంకోవైపు హీరోగా చేస్తూ ఫుల్‌ బిజీ బిజీగా గడుపుతున్నాడు.
కాంచన-3 చిత్రం తర్వాత మూడేళ్ల పాటు గ్యాప్‌ తీసుకుని రుద్రుడు సినిమాతో లారెన్స్‌ మరోసారి ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.

ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రానికి కధిరేశన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్‌లు సినిమాపై ఎక్స్ పర్టేషన్స్ ని పెంచుతున్నాయ్. కాగా తాజాగా చిత్రబృందం ఈ చిత్రం నుంచి టీజర్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది.అన్న చంపింది రౌడీనో.. వేటగాడో కాదు. వేరే ఎవడో ఒకడు అంటూ విలన్స్ లారెన్స్ వెనకాల పరుగెత్తడం టీజర్ గ్లింప్స్ కనిపించింది. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ మూవీని ఫైవ్‌ స్టార్‌ క్రియేషన్స్ బ్యానర్‌పై కదిరేశన్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. లారెన్స్‌కు సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: డ్యాన్స్ మా రక్తంలోనే ఉంది.. జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Exit mobile version