Site icon Prime9

MLC Election: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ.. ఎంఐఎంకు కేసీఆర్ మద్దతు

KCR

KCR

MLC Election: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు దీనిపై ప్రకటన విడుదల చేశారు. మిత్రపక్షం మజ్లిస్‌ అభ్యర్ధన మేరకు.. మద్దతు ప్రకటిస్తున్నట్లు భారాస వర్గాలు తెలిపాయి.

ఈ ఎన్నికల్లో భారాస దూరం.. కారణం ఇదేనా (MLC Election)

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 13న హైదరాబాద్‌ స్థానిక సంస్థల స్థానంతో పాటు.. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం చేసిన అభ్యర్ధన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాగా..మరొకటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ. ఇక ఈ రెండు స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండనున్నట్లు సమాచారం.

ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మీర్జా రహమత్‌ బేగ్‌

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం పార్టీ మీర్జా రహమత్‌ బేగ్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్సీ.. అమీన్‌ ఉల్‌ హసన్‌ జాఫ్రీకి అవకాశం ఇవ్వలేదు. భవిష్యత్తులో జాఫ్రీ సేవలను ఉపయోగించుకుంటామని అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. మీర్జా రహమత్ బేగ్.. 2018 ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

ఏ పార్టీ సొంతంగా గెలవలేని పరిస్థితి

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో ఏ పార్టీ సొంతంగా గెలవలేని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీ కోటా ఓట్లు 127 కాగా ఇందులో ప్రస్తుతం 9 ఖాళీలు ఉన్నాయి. ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 118. ఎంఐఎం 52, బీఆర్‌ఎస్‌ 41, బిజెపికి 25 ఓట్ల చొప్పున ఉన్నాయి. ఇందులో మెుత్తం ఓట్లలో 60 ఓట్లు వస్తే గెలిచినట్లు. కాబట్టి ప్రస్తుతం ఏ పార్టీ కూడా సొంతంగా గెలవలేని పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపీ భాజపా ఆలోచన చేస్తుంది. తొలుత ఎన్నికకు దూరంగా ఉండాలని ఆ పార్టీ భావించింది. తాజాగా బీఆర్ఎస్ ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నట్టు తెలవడంతో.. బీజేపీ పునరాలోచనలో పడింది. మరోవైపు హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ అభ్యర్థిగా ఏవీఎన్‌ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎల్లుండితో నామినేషన్ల ఘట్టం ముగియనుంది.

 

Exit mobile version
Skip to toolbar