Site icon Prime9

SC ST case: ఎస్సీ, ఎస్టీ కేసులు అందరిపైనా పెట్టే దమ్ముందా…కౌంటర్ ఇచ్చిన షర్మిల

Put SC and ST cases on everyone

Put SC and ST cases on everyone

YS Sharmila: దళిత ఎమ్మెల్యే అన్యాయం చేస్తే మాట్లాడకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా, అలాగైతే ఎస్సీ, ఎస్టీ కేసులు అందరి మీద పెట్టే దమ్ముందా అని వైఎస్ఆర్టీపి నాయకురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలపై జోగిపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై ఆమె ఈ మేరకు స్పందించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ అవినీతి గురించి మాట్లాడింది నిజమేనన్నారు. స్వయానా ఎమ్యెల్యే తండ్రి పేర్కొన్న మాటలనే నేను ప్రస్తావించారన్నారు.

మరియమ్మను లాకప్ లో పెట్టి కొట్టి చంపేస్తే ఇదే ఎమ్మెల్యే పోలీసుల పైన ఎందుకు కేసు పెట్టలేదని నిలదీసారు. దళిత ముఖ్యమంత్రి అని మాట తప్పిన కేసిఆర్ పై కేసు పెట్టే దమ్ము ఉందా అని వ్యాఖ్యానించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కు వైఎస్సార్ అంబేడ్కర్ పేరును కేసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేడ్కర్ పేరు తొలగిస్తే ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. తనపై పెట్టిన కేసులకు భయపడేది లేదని షర్మిల తెలిపారు. ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్ బిడ్డ. అది కూడా పులి బిడ్డగా చెప్పారు. జోగిపేట గడ్డ మీద డిబేట్ పెడితే అవినీతిని నిరూపిస్తామని ఆమె సవాల్ విసిరారు.

ఈ మద్య కాలంలో షర్మిల టీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతికి పాల్పొడ్డారంటూ పలు విమర్శలు చేశారు. దీనిపై వారు షర్మిలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కూడా ఫిర్యాదు చేశారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు షర్మిలపై భగ్గుమంటున్నారు. తాజాగా దళిత ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దళిత సామాజిక వర్గాలు పెద్ద యెత్తన నిరసనలకు దిగారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి:YS Sharmila :వైఎస్ షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు ?

Exit mobile version
Skip to toolbar