Site icon Prime9

Devi Sri Prasad: మైత్రీ మూవీ మేకర్స్‌పై దేవిశ్రీ ప్రసాద్‌ షాకింగ్‌ కామెంట్స్‌ – తప్పేముందన్న ప్రొడ్యూసర్‌

Devi Sri Prasad Comments on Pushpa 2 Producers: రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ చేసిన కామెంట్స్ మైత్రీ మూవీ మేకర్స్‌ స్పందించారు. తాజాగా నితిన్‌ రాబిన్‌ హుడ్‌ మూవీ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయనకు దేవిశ్రీ కామెంట్స్‌ ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ ఆయన మాట్లాడిన దాంట్లో తనకు తప్పేం కనిపించలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కాగా పుష్ప 2లోని ఐటెం సాంగ్‌ కిస్సిక్‌ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ని చైన్నైలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో దేవిశ్రీ చేసిన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. తనని లేట్‌ అనవద్దని, తాను ఎప్పుడో వచ్చినా.. కెమెరాలు అని చెప్పి ఆపేశారంటూ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌ని పేరు ప్రస్తావిస్తూ తను అడాగాలనుకున్నది అడిగేశాడు.

తాను ఏదైనా సూటిగా మాట్లాడతానని, అప్పుడే కిక్ ఉంటుందన్నాడు. మనకు రావాల్సింది ఏదైనా అడిగి తీసుకోవాలి అది నిర్మాత దగ్గర నుంచి వచ్చే క్రిడిట్‌ అయినా.. స్క్రీన్ మీద పడే క్రెడిట్‌ అయినా అంటూ ఊహించని కామెంట్స్‌ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలకు నాపై లవ్ ఎక్కువ. కానీ ఆ లవ్ కంటే కూడా కంప్లైంట్స్‌ ఎక్కువ అయ్యాయి. టైం సాంగ్‌ ఇవ్వడు, టైం రాడు అంటూ నాపై ఎన్నో కంప్లైట్స్‌ ఇస్తున్నారంటూ అసహనం చూపించాడు. దీంతో కొంతకాలంగా నిర్మాతలతో దేవిశ్రీకి మనస్పర్థలు వచ్చాయన్న రూమర్స్‌కి ఇవి మరింత ఆజ్యం పోశాయి. దీంతో దేవిశ్రీ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

అయితే దేవి కామెంట్స్ తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌లో ఒకరైన రవిశంకర్‌ యలమంచిలి స్పందించారు. రాబిన్‌ హుడ్ మూవీ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయనకు దేవి కామెంట్స్‌ గురించి ఏం అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. దానికి ఆయన.. దేవి ఏం అన్నారు. నిర్మాతలకు నాపై లవ్‌ ఉంటది. అలాగే కంప్లైంట్స్‌ కూడా ఎక్కువే అన్నారు. అందులో తప్పేముంది. అందులో నాకు పెద్ద తప్పేం అనిపించలేదు. కానీ ఆర్టికల్స్‌లో అదీ ఇది అని రాస్తున్నారు. మా మధ్య ఏం లేదు. మేమంత ఒక ఫ్యామిలీ అంతే. మేము ఉన్నన్ని రోజులు ఆయనతో మేము సినిమాలు చేస్తాం.. ఆయన మాతో సినిమాలు చేస్తారు” అంటూ రూమర్స్‌కి చెక్‌ పెట్టారు.

కాగా పుష్ప పార్ట్‌ వన్‌కి దేవిశ్రీనే మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించిన సంగతి తెలిసిందే. అలాగే పార్ట్‌ 2కి కూడా ఆయననే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే సడెన్‌గా ఈ సినిమాలోకి తమన్‌ ఎంట్రీ ఇచ్చాడు. తమన్‌తో పాటు మరో ఇద్దరు మ్యూజిక్‌ డైరెక్టర్‌ పని చేశారు. దీంతో దేవిశ్రీ ఉండగా.. వారేందుకు అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. అయితే దీనికి మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. దాంతో మేకర్స్‌కి దేవిశ్రీకి మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తుల పుట్టుకొచ్చాయి. వాటికి రీసెంట్‌ దేవిశ్రీ ప్రసాద్‌ చేసిన కామెంట్స్‌ మరింత ఆజ్యం పోశాయి.

Exit mobile version