Site icon Prime9

Prasad IMAX: ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో రిలీజ్‌ కానీ ‘పుష్ప 2’ – కారణం ఏంటంటే!

Pushpa 2 Not Released in Prasad Multiplex: హైదరాబాద్‌ థియేటర్‌ పేరు చెప్పమంటే అంతా ప్రసాద్‌ పల్టీప్లెక్స్‌ పేరే చెబుతారు. పెద్ద పెద్ద సినిమాలు ప్రీమియర్స్‌, బెన్‌ఫిట్‌ షోలు ఈ థియేటర్‌లోనే పడుతుంటారు. ఇక ఫస్ట్‌ షో అంటే ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ అనే అంటారు. ఏ కొత్త సినిమా రిలీజ్‌ అయిన నగరవాసులు, రివ్యూవర్స్‌ అంతా ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కే తరలివస్తారు. హైదరాబాద్‌లోని థియేటర్లు ఎన్ని ఉన్న ప్రసాద్‌ ఐమ్యాక్ ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద పెద్ద సినిమాలన్ని ఇక్కడకు రావాల్సిందే.  అలాంటి ఈ థియేటర్ల పుష్ప 2 రిలీజ్‌ కాకపోవడం గమనార్హం. డిసెంబర్‌ 5న పుష్ప 2 గ్రాండ్‌గా రిలీజ్‌ అయ్యింది.

పాన్‌ ఇండియా స్థాయిలో కొన్ని వేల థియేటర్లలో ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. కానీ ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ మాత్రం రిలీజ్‌ కాలేదు. ఇదే విషయాన్ని ఐమ్యాక్స్ వెల్లడిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ షేర్‌ చేసింది. పుష్ప 2ను తమ థియేటర్స్‌లో ప్రదర్శించడం లేదని ప్రసాద్‌ ఐమాక్స్‌ ప్రకటిస్తూ అసలు విషయం చెప్పింది. “దాదాపు 20ఏళ్ల పైగా ప్రేక్షకులకు అత్యుత్తమమైన సినిమాటిక్‌ ఎక్స్‌పిరియన్స్‌ని అందిస్తూ వస్తున్నాం. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల పుష్ప2 చిత్రాన్ని మీ అందరికీ ఇష్టమైన ప్రసాద్‌ ఐమాక్స్‌లో ప్రదర్శించలేకపోతున్నాం. ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం’ అని ప్రకటించింది.

అయితే పుష్ప 2 ప్రదర్శించకపోవడానికి గల అసలు కారణాన్ని మాత్రం యాజమాన్య వెల్లడించలేదు. ఇది తెలిసి ఆడియన్స్‌ అంతా షాక్‌ అవుతున్నారు. అతిపెద్ద థియేటర్‌ అయిన ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ పుష్ప 2ని ప్రదర్శించకపోవడం ఆశ్చర్యంగా ఉందని, అసలేం జరుగుతుందని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే, చిత్ర నిర్మాతలు, థియేటర్‌ యాజమాన్యం మధ్య అగ్రిమెంట్‌ విషయంలో మనస్పర్థలు తలెత్తినట్లు విశ్వసనీయ సమాచారం. రెవెన్యూ షేరింగ్‌ విషయంలో సరైన ఒప్పందం కుదరకపోవడం వల్లే పుష్ప2 మూవీ ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో విడుదల కాలేదని తెలుస్తోంది.

Exit mobile version