Hyderabad: ఇటీవల కాలంలో వన్యప్రాణులు జనవశంలోకి వస్తున్న ఘటనలు మనం గమనించవచ్చు. పులులు, ఏనుగులు వంటివి ప్రజల నివసిస్తున్న ప్రదేశాలకు రావడం చూశాం… ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి మొసళ్ళు కూడా చేరాయి. గ్రేటర్ హైదరాబాద్(Hyderabad)లో మొసళ్ళు సంచరిస్తున్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో మొసళ్ళ కలకలం రేపాయి. ఉప్పర్ పల్లి లోని ఈసా నదిలో మొసళ్ళు సంచారంతో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు భయబ్రాంతులను గురవుతున్నారు. ఈసానది ఉడ్డున దర్జాగా మొసళ్లు సేద తీరడంతో వాటిని చూసిన స్థానికులు 100 కు ఫొన్ చేసి సమాచారం అందించారు.
హడలెత్తిస్తున్న మొసళ్లు..
సమాచారం అందుకున్న హుటాహుటిన రాజేంద్రనగర్ పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మొసళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించగా అవి నీళ్లలోకి వెళ్లిపోయాయి. స్థానికులెవరూ నది వైపు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరించారు. సైన్ బోర్డులు సైతం ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో స్థానికులంతా భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ప్రభుత్వం తగు చర్యలు వెంటనే తీసుకోవాలని కోరుతున్నారు.
ఇటీవల సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో పరిశ్రమలో చిరుత కలకలం రేపింది. తెల్లవారుతున్న సమయంలో చిరుత హెటిరో పరిశ్రమలోని ఓ బ్లాక్ లోకి ప్రవేశించింది. దీన్ని గమనించిన కార్మికులు అప్రమత్తమై బయటకు పరుగులు పెట్టారు. చిరుత బయటికి రాకుండా బయటికి వచ్చే ద్వారాలు మూసేశారు. తర్వాత అధికారులు చాకచక్యంగా చిరుతను పట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి…
No Trousers Day: ఫ్యాంట్లు ధరించకుండా లండన్ మెట్రోలో ప్రయాణించిన ప్యాసింజర్లు.. ఎందుకో తెలుసా?
China Accident : చైనాలో ఘోర ప్రమాదం..17 మంది మృతి, 22 మందికి గాయాలు.. కారణం ఏంటంటే?
Prince Harry : విలియం నాపై దాడిచేసాడు… ఆత్మకధలో సంచలన విషయాలు వెల్లడించిన ప్రిన్స్ హ్యారీ
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/