Priyanka Chopra : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అని చెప్పాలి. తన నటనతో, అందంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాల ప్రస్థానం కలిగి ఉన్నారు. టాప్ స్టార్స్ తో జతకట్టిన ఈ స్టార్ లేడీ అనేక బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియాంకా చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ప్రియాంక తెలుగులో రామ్ చరణ్ సరసన తుఫాన్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా హిందీలో ‘జంజీర్’గా విడుదలైంది. ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ మూవీ అమితాబ్ ఆల్ టైమ్ క్లాసిక్ ‘జంజీర్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.
తమిళ చిత్రం తమీజాతో ప్రియాంక చోప్రా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. విజయ్ ఆ చిత్ర హీరో. తర్వాత ఆమె సౌత్ ఇండియాలో చిత్రాలు చేయలేదు. బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్న క్రమంలో అక్కడే సెటిల్ అయ్యారు. అయితే కొన్నాళ్లుగా ప్రియాంక చోప్రా హాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారు. అక్కడ టెలివిజన్ సిరీస్ లు చిత్రాలు చేస్తున్నారు. 2017 లో విడుదలైన బేవాచ్ మూవీలో ప్రియాంక కీలక రోల్ చేశారు. హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ డ్రామా పర్లేదు అనిపించుకుంది. ప్రస్తుతం ఆమె అధికంగా ఇంగ్లీష్ చిత్రాలు చేస్తున్నారు.
బాలీవుడ్ రాజకీయాల్లో నేను ఇమడలేకపోయాను – ప్రియాంక చోప్రా (Priyanka Chopra)
తాజాగా బాలీవుడ్ ని ఉద్దేశిస్తూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. రీసెంట్ మీడియా ఇంటరాక్షన్ లో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. బాలీవుడ్ పరిశ్రమ నన్ను పక్కన పెట్టేసింది. ఉద్దేశపూర్వకంగా నాకు అవకాశాలు రాకుండా చేశారు. ఈ క్రమంలో కొందరితో గొడవలు అయ్యాయి. బాలీవుడ్ రాజకీయాల్లో నేను ఇమడలేకపోయాను. పాలిటిక్స్ చేయడం నాకు రాదు. అందుకే బాలీవుడ్ నుండి బ్రేక్ తీసుకున్నాను, అన్నారు. టాప్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ అనుభవించిన ప్రియాంక చోప్రా సొంత పరిశ్రమ మీద చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెద్ద దుమారం రేపుతున్నాయి. ఎప్పటి నుండో తనలో ఉన్న అసహనాన్ని ప్రియాంక చోప్రా బయటపెట్టారనిపిస్తుంది. మరి బాలీవుడ్ పై ప్రియాంక చోప్రా చేసిన ఈ ఆరోపణలకు ఎవరైనా కౌంటర్ ఇస్తారేమో చూడాలి.
ప్రియాంక చోప్రా 2018లో అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్నారు. నిక్ వయసులో ప్రియాంక కంటే 10 ఏళ్ళు చిన్నవాడు కావడం విశేషం. ఈ విషయంలో ఆమె పలుమార్లు ట్రోల్స్ కి గురయ్యారు. లాస్ ఏంజెల్స్ లో లగ్జరీ హౌస్ కొన్న ప్రియాంక భర్తతో అక్కడే కాపురం పెట్టారు. సరోగసి ద్వారా ప్రియాంక ఓ పాపకు తల్లయ్యారు. ప్రస్తుతం ప్రియాంక చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.