Site icon Prime9

Prashant Kishor: జాతీయ రాజకీయాలపై దీని ప్రభావం ఉండదు.. బీహార్ పరిణామాలపై ప్రశాంత్ కిషోర్

Bihar: హార్‌ రాజకీయాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తనదైన శైలిలో స్పందించారు. బీజేపీతో అసౌకర్యంగా ఉండటం వల్ల తెగతెంపులు చేసుకుని ఇతర పార్టీల పొత్తుతో నితీష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేశారని అన్నారు. ఒకప్పడు ప్రశాంత్‌ కిశోర్‌ నితీష్‌కుమార్‌కు అత్యంత సన్నిహితుడు. అయితే బీహార్‌లో తాజా రాజకీయ పరిణామాలు కేవలం బీహార్‌ వరకు మాత్రమే పరిమితం అవుతాయని, జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపవని ఆయన స్పష్టం చేశారు.

2017 నుంచి 2022 వరకు బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపారు. అయితే పలు కారణాల వల్ల నితీష్‌కు బీజేపీతో పొసగలేదన్నారు. కొత్తగా మహాఘట్‌బంధన్‌తో ప్రయోగం చేద్దామనుకొని చిన్నా చితకా పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని ప్రశాంత్‌ కిశోర్‌ తాజా పరిణామాలపై స్పందించారు. నితీష్‌కు ఇది ఆరో ప్రయోగమన్నారు. 2012-13 నుంచి ఆయన అనేక పార్టీలతో పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారని ప్రశాంత్‌ అన్నారు. కొత్త ప్రభుత్వంతో రాష్ట్రానికి మంచి చేసే అవకాశం ఉందన్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌.

Exit mobile version