Site icon Prime9

Unstoppable 2 : డార్లింగ్ కి బాలకృష్ణ భలే ప్రశ్న… అనుష్క, కృతి సనన్ లలో ఎవరితో డేటింగ్ ?

prabhas interesting words about anushka shetty and krithi sanon

prabhas interesting words about anushka shetty and krithi sanon

Unstoppable 2 : ‘ఆహా’ లో బాలయ్య ‘అన్ స్టాపబుల్ 2’ టాక్ షో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ – గోపీచంద్ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ శుక్రవారం అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బాలయ్యతో కలిసి ప్రభాస్ – గోపీచంద్ ఇద్దరూ కూడా ఒక రేంజ్ లో సందడి చేశారు.

ఎపిసోడ్ లోని ఒక సెగ్మెంట్ లో భాగంగా బోర్డ్ పై కొంతమంది హీరోయిన్స్ ని చూపిస్తూ ప్రభాస్ ని పలు ప్రశ్నలు అడిగాడు బాలయ్య. నయనతార, తమన్నాని చూపిస్తూ ఎవర్ని షాపింగ్ కి తీసుకెళ్తావ్ అంటే ఇద్దర్ని అని చెప్పాడు. అలాగే పూజా హెగ్దే, శ్రద్ధా కపూర్ ఫోటోలని చూపించి ఇద్దరిలో ఎవరితో కలిసి సినిమాకి వెళ్తావు అని అడిగితే.. సినిమాకు వెళ్లినప్పుడు ఎవరిని తీసుకెళ్లడం ఇష్టం ఉండదని చెప్పాడు ప్రభాస్. మరో ఇద్దరు హీరోయిన్స్ ని చూపించి వీళ్ళతో ఎవరితో నే ఫోన్ మార్చుకోవాలనుకుంటావు అని అడిగితే ఫోన్ ఎవరి పర్సనల్ వాళ్ళది, వాళ్ళకి కూడా పర్సనల్ అసలు ఇది వర్కౌట్ అవ్వదు అని అన్నాడు. అలాగే కృతి సనన్, అనుష్క శెట్టి ఫొటోలని చూపించి.. ఒకవేళ వీళ్ళతో డేటింగ్ లో ఉన్నట్టు రూమర్స్ వస్తే ఎవరితో నిజం అని నమ్ముతారు అని అడిగితే ఎవర్ని నమ్మరు అని ప్రభాస్ అంటు.. అక్కడ ఉన్న ప్రేక్షకులు మాత్రం అనుష్క పేరు చెప్పారు.

అయితే ఈ టాపిక్ తో మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ లో చర్చ స్టార్ట్ అయింది. పలు రకాల మీమ్స్ ను క్రియేట్ చేసి వాటిని షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ’ మా పాటికి మేము మా ప్రభాస్ అన్న సింగిల్ అని ఫిక్స్ అయ్యి ఉంటే .. ఇలాంటి టాక్ షోకి పిలిచి అనుష్క.. క్రితి నా అని అయోమయంలో పడేసి.. రాణి ఎవరో చెప్పకుండానే షో ముగించేస్తే ఎలా .. మాకు ఇపుడే రాణి ఎవరో తెలియాలి.. తెలిసి తీరాలి’ అంటూ మీమ్స్ సందడి చేస్తున్నాయి. ప్రభాస్ రాణి ఎవరో తెలుసుకోవడానికి పార్ట్ 3 ప్లాన్ చేయాలంటూ ఆహా ను ట్యాగ్ చేస్తూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ క్రియేట్ చేసిన మీమ్స్ ని ఆహీ రీట్వీట్ చేయడం విశేషం.

Exit mobile version