Site icon Prime9

Prabhas: బర్త్‌డే స్పెషల్‌: ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిన ‘రాజాసాబ్‌’ టీం – మోషన్‌ పోస్టర్‌ చూశారా? మామూలుగా లేదు..

The Raja Saab Motion Poster

The Raja Saab Motion Poster Out: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ బర్త్‌డే వేడుకలు వారం ముందు నుంచే జరుగుతున్నాయి. కొద్ది రోజులుగా సోషల్‌ మీడియా మొత్తం డార్లింగ్‌ బర్త్‌డే హడావుడే కనిపిస్తోంది. అక్టోబర్‌ 23న ప్రభాస్ బర్త్‌డేను అభిమానులంత ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. నెట్టింట ఎక్కడ చూసిన ప్రభాస్‌ బర్త్‌డే పోస్ట్సే దర్శనం ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ బాక్సాఫీసు రారాజు బర్త్‌డే అంటే ఫ్యాన్స్‌కి మూవీ మేకర్స్‌ ఎలాంటి ట్రీట్‌ ఇస్తారనేది ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్నవన్ని భారీ ప్రాజెక్ట్సే. ఏ మూవీ ఎలాంటి అప్‌డేట్‌ వస్తుందా? అని ఫ్యాన్స్‌ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

ముఖ్యంగా రాజాసాబ్‌ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ రాబోతోందంటూ సోషల్‌ మీడియాలో గట్టి ప్రచారం జరిగింది. ఇది ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, అది చూసి ఫ్యాన్స్‌ అంతా థ్రిల్‌ అవుతారంటూ మూవీ టీం కూడా చెప్పెకొచ్చింది. చెప్పినట్టుగా డార్లింగ్‌ బర్త్‌డే కానుకగా రాజా సాబ్‌ టీం అప్‌డేట్‌ వదిలింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశాడు దర్శకుడు మారుతి. ఇప్పటికే ‘సింహాసనం తనకు చెందిన వ్యక్తి కోసం ఎదురుచూస్తోందంటూ తలకిందులుగా ఉన్న ఓ సింహాసనం ఫోటోను రిలీజ్‌ చేసి అంచనాలు పెంచారు.

ఇక నేడు ప్రభాస్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సింహాసనం ఎవరిదో సీక్రెట్ రివీల్‌ చేస్తూ మోషన్‌ పోస్టర్‌ పేరుతో స్పెషల్‌ వీడియో వదిలారు. డార్క్‌ థీమ్‌తో సాగిన ఈ వీడియో ఆడియన్స్‌ ఆకట్టుకుంటుంది. ఈ మోషన్ పోస్టర్‌ ద్వారా ఇదోక స్పెషన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమని హింట్‌ ఇచ్చింది టీం. దాదాపు 2 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో మధ్యలో ప్రభాస్‌ లుక్‌ రివీలైంది. ఇందులో డార్లింగ్‌ రాజుగా కనిపించాడు. రాజుగా సింహాసనంపై కూర్చోని సిగరెట్‌ తాగుతూ రాజసం ఉట్టిపడేలా కనిపించాడు ప్రభాస్‌. రాయల్‌గా, సరికొత్తగా కనిపించాడు. కానీ ఇదే లుక్‌లో కాస్తా భయం పుట్టించేలా కూడా ఉన్నాడు. సిగరేట్‌ తాగుతూ సీరియస్‌గా చూస్తున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్‌ మోషన్‌ పోస్టర్‌ హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. ఇక ఈ చిత్రం హారర్‌ అండ్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఇప్పటికే మూవీ టీం తెలిపింది. ఇప్పుడు మోషన్‌ పోస్టర్‌లోనూ అదే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు మేకర్స్‌. 2025 ఏప్రీల్‌ 10న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. పీపుల్స్‌ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version