Site icon Prime9

Adipurush : ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్ చేసిన ప్రభాస్ ఆదిపురుష్.. 70 దేశాలలో విడుదలకి ప్లాన్!

prabhas adipurush movie trailer release date confirmed

prabhas adipurush movie trailer release date confirmed

Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం “ఆదిపురుష్”. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. సుమారు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. రామాయణం ఆధారంగా ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో, ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది.

అయితే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ‘ఆదిపురుష్’ భారీ చిత్రం అవుతుందని అంతా భావించారు. దీనికి తోడు ‘తానాజీ’ వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన దర్శకుడు ఓం రౌత్.. ‘ఆదిపురుష్’ (Adipurush) కు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే, కిందటేడాది అక్టోబర్‌లో విడుదలైన ‘ఆదిపురుష్’ టీజర్ ఆ అంచనాలన్నింటినీ తారుమారు చేసింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పై భారీగా ట్రోలింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్ వరకు వాయిదా వేశారు. 3డీ తోపాటు.. వీఎఫ్ఎక్స్ లోనూ పలు మార్పులు చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే ఆపడేట్ వచ్చింది.

మూవీ ట్రైలర్ ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఈ మేరకు చిత్ర నిర్మాతలు నేడు అధికారికంగా ప్రకటించారు. అలానే సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆకాశం వైపు విల్లును ఎక్కుపెట్టిన రాముడిలా ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉంది. ఈ పోస్టర్‌తో విడుదల తేదీ మీద కూడా మరోసారి స్పష్టత ఇచ్చారు నిర్మాతలు. అదే విధంగా.. ఈ ట్రైలర్‌ను భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా మరో 70 దేశాల్లో ఈ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతుంది.

కాగా అంతకు ముందు రిలీజ్ అయిన టీజర్ లో.. వీఎఫ్ఎక్స్ ఆశించిన స్థాయిలో లేవని.. సినిమాలో పాత్ర చిత్రీకరణ వివాదాస్పదమైంది. ఆంజనేయుడు, లంకేశ్వరుడు పాత్రలు రామాయణంలో పాత్రలకు విరుద్ధంగా ఉన్నాయంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఈ సినిమాను బ్యాన్ చేయాలని కూడా చాలా మంది డిమాండ్ చేశారు.

Exit mobile version
Skip to toolbar