Site icon Prime9

Adipurush : ప్రభాస్ “ఆదిపురుష్” సినిమాకి ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్షన్స్ వచ్చాయంటే..?

prabhas adipurush movie first day collections details

prabhas adipurush movie first day collections details

Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో వచ్చిన చిత్రం “ఆదిపురుష్”. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించారు. సుమారు 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 6200 థియేటర్స్ లో విడుదల కాగా ఒక్క ఇండియాలోనే దాదాపు 4000 పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అందుకుని రికార్డులు సృష్టించింది. మొదటిరోజు ఈ సినిమా ఏకంగా 140 కోట్లు కలెక్షన్స్ అందుకున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు రోజులు కూడా వీకెండ్ కావడంతో ఆదిపురుష్ టికెట్స్ భారీగా అమ్ముడుపోయాయని సమాచారం అందుతుంది. ఈ కలెక్షన్స్ జోరు చూస్తుంటే ఫస్ట్ వీకెండ్ తోనే ఆదిపురుష్ 200 కోట్ల మార్క్ ని అందుకునేలా కనిపిస్తుంది. మరి ఆదివారం నాటికి ఈ చిత్రం ఏ స్థాయి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

 

 

కాగా మరోవైపు ప్రభాస్ ఈ చిత్రంతో మొదటి రోజు 100 కోట్ల మార్క్ క్రాస్ చేయడంతో.. ఫస్ట్ డే నే 100 కోట్లు పైగా సాధించిన మూడు సినిమాలతో ఇండియాలోనే ఏకైక హీరోగా నిలిచాడు. దీంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ గా హల్ చల్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ గత చిత్రాలు బాహుబలి, సాహూ సినిమాలు ఫస్ట్ డే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది.

Exit mobile version