Site icon Prime9

PM Modi: చీపురు పట్టి చెత్తను ఊడ్చిన ప్రధాని మోదీ

PM Modi

PM Modi

 PM Modi: గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత డ్రైవ్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందిస్తూ రాజకీయ నాయకుల నుండి విద్యార్థుల వరకు ఆదివారం ఒక గంటపాటు శ్రమదానంలో పాల్గొన్నారు. ఆయన పిలుపునిచ్చిన – ‘ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్’ ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించబడింది. ప్రధాని మోదీ కూడా ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంకిత్ బైయన్‌పురియాతో కలిసి ఈ డ్రైవ్‌లో పాల్గొన్నారు. వారిద్దరు చీపుర్లు పట్టుకుని చెత్తను ఊడ్చి శుభ్రం చేసారు.

ఈ సందర్బంగా తన అధికారిక X ఖాతాలో వీడియోను పంచుకుంటూ ప్రధాని ఇలా వ్రాశారు. ఈ రోజు, దేశం స్వచ్ఛతపై దృష్టి సారిస్తుంది, అంకిత్ బైయన్‌పురియా మరియు నేను అదే చేసాము. పరిశుభ్రతకు మించి, మేము ఫిట్‌నెస్ మరియు శ్రేయస్సును కూడా కలిపి చేసాము. ఇది అంతా పరిశుభ్ర భారతం గురించి.బీజేపీ నేతలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టారు.
హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లో, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఢిల్లీలో పాల్గొన్నారు. వీడియోలో మోదీ అంకిత్‌తో అతని శారీరక దినచర్య గురించి మాట్లాడటంచూడవచ్చు.

రెండు విషయాల్లో క్రమశిక్షణ లేదు.. ( PM Modi)

మీరు శారీరక శ్రమకు ఎంత సమయం కేటాయిస్తారు? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.అంకిత్ బదులిస్తూ అంతగా లేదు సార్, దాదాపు 4-5 గంటలు. మిమ్మల్ని చూడగానే నాకు చాలా ప్రేరణ కలుగుతుందని చెప్పారు. దానికి మోదీ స్పందిస్తూ నేను పెద్దగా వ్యాయామం చేయను అని అన్నారు. కానీ నేను క్రమశిక్షణను పాటిస్తాను. ప్రస్తుతం నాకు క్రమశిక్షణ లోపించిన రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి నా భోజనం చేసే సమయం.  మరొకటి నిద్ర కోసం కొంత సమయం కేటాయించాలి. అది నేను చేయలేను అని మోదీ అన్నారు. సోషల్ మీడియాను సానుకూలంగా ఉపయోగిస్తున్నందుకు అంకిత్ ను మోదీ ప్రశంసించారు.సోషల్ మీడియాను సానుకూలంగా ఎలా ఉపయోగించవచ్చో చెప్పడానికి మీరు ఉదాహరణగా నిలిచారు. జిమ్‌కి వెళ్లే యువత ఇప్పుడు మీ రొటీన్‌లను అనుసరిస్తున్నట్లు నేను చూశాను అని ప్రధాని అన్నారు.

Exit mobile version