Site icon Prime9

PM Narendra Modi: కామన్‌వెల్త్‌ గేమ్స్‌ క్రీడాకారులతో ప్రధాని భేటీ

New Delhi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులతో భేటీ అయ్యారు. బర్మింగ్‌హామ్‌లో మెడల్స్‌ సాధించిన వారితో తాను భేటీ అవుతానని గతంలోనే ప్రధాని ప్రకటించారు. చెప్పిన విధంగానే మోదీ తన స్వగృహంలో మెడల్స్‌తో తిరిగి వచ్చిన క్రీడాకారులతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి కేంద్ర క్రీడామంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, సహాయమంత్రి నిషిత్‌ ప్రమాణిక్‌లు కూడా హాజరయ్యారు.

క్రీడాకారులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. క్రీడాకారులతో భేటీ కావడానికి ప్రధాన కారణం వారిని ప్రోత్సహించడమేనని ఆయన అన్నారు. పతకాలు సాధించడంలో మన యువశక్తికి ఇది ఆరంభం మాత్రమేనని, త్వరలోనే క్రీడారంగంలో స్వర్ణ యుగం చూస్తారని మోదీ అన్నారు. అథ్లెట్లు యువకులతో భేటీ అయ్యి వారిని కూడా ఖేలో ఇండియాలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. బాక్సింగ్‌, జుడో, రెస్లింగ్‌లలో మన కుమార్తెలు సత్తా చాటారని మహిళా క్రీడాకారులను అభినందించారు. ఏక్‌భారత్‌, శ్రేష్ట భారత్‌కు మీరే స్ఫూర్తి అని ప్రధాని అన్నారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ మొత్తం 61 పతకాలు సాధించింది. విజేతలకు క్రీడామంత్రిత్వశాఖ అశోకా హోటల్‌లో క్రీడాకారులను సన్మానించింది.

Exit mobile version