Site icon Prime9

Mangalavaaram Movie : అజయ్ భూపతి మంగళవారం మూవీ పోస్టర్ రిలీజ్.. అర్ధ నగ్నంగా “పాయల్ రాజ్ పుత్”

payal rajputh poster released from Mangalavaaram Movie

payal rajputh poster released from Mangalavaaram Movie

Mangalavaaram Movie: టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి మళ్ళీ మరో సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. దాదాపు ఐదేళ్ల కిందట ఈయన తెరకెక్కించిన ఆర్ఎక్స్ – 100 చిత్రం ఒకేసారి అజయ్ కి, హీరో కార్తికేయకి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. చిన్న సినిమాగా వచ్చిన ఆ మూవీ భారీ హిట్ అందుకోవాడమే కాకుండా యూత్ లో ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగింది. ఈ సినిమా తోనే పాయల్ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పాయల్ కొంచెం బోల్డ్ గానే నటించింది. పాయల్ కి ఈ సినిమా బాగా పేరు తీసుకురావడంతో తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి.

ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత “మహాసముద్రం” సినిమాతో వచ్చిన అజయ్ భూపతి ప్రేక్షకులను నిరాశ పరిచాడు. కాగా ఇప్పుడు మళ్ళీ ఆ బోల్డ్ కాంబోని రిపీట్ చేస్తున్నాడు. పాయల్ ముఖ్య పాత్రలో మరో సినిమాతో రాబోతున్నాడు అజయ్. మంగళవారం అనే టైటిల్ తో ఈ మూవీ వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో పాయల్ అర్ధ నగ్నంగా కనిపిస్తుండడం టాక్ ఆ ది టౌన్ గా మారింది. దీంతో ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇక సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ మేరకు ఓ బోల్డ్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘శైలు.. చాలాకాలం మీ గుండెల్లో ఉండిపోతుంది’’ అని అజయ్ ట్వీట్ చేశారు. అర్ధనగ్నంగా ఉన్న పాయల్‌ రాజ్‌పుత్‌ పోస్టర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. పోస్టర్‌లో పాయల్‌ వేలిపై సీతాకోకచిలుక, కంట్లో నీళ్లు కనిపించాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ని గమనిస్తే ఈ చిత్రంలో పాయల్ శైలజ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. గ్రామీణ నేపథ్యంలో 1990లో జరిగే కథ ఇదని తెలుస్తోంది. ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇండియాలో సినిమా రాలేదని అజయ్‌ భూపతి చెప్పుకొచ్చారు. సినిమాలో ముప్పై పాత్రలున్నాయని, ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్‌ ఉంటుందని తెలిపారు. షూటింగ్‌ చివరిదశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. అజనీష్ ఇటీవలే విరూపాక్ష సినిమాకు సంగీతం అందించగా సినిమా భారీ హిట్ అయింది. మ్యూజిక్ కి మంచి పేరు వచ్చింది. మరి అజయ్ తనకు కలిసొచ్చిన హీరోయిన్ పాయల్ తో మరోసారి హిట్ కొడతాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచగా.. ఈ పోస్టర్ తో అజయ్ ఈసారి గట్టిగా హిట్ కొట్టడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.

Exit mobile version