Site icon Prime9

PawanKalyan : ప్రజాసమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా.. పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  ఆదివారం విజయవాడలో ‘జనవాణి-జనసేన భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు అందిస్తామన్నారు.

విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు  మధ్యవర్తి విధానం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వినతిపత్రం అందజేసారు. .  కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఎన్నికల వేళ జగన్‌ హామీ ఇచ్చారని, దాన్ని ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగులకు న్యాయం చేస్తామని పవన్  హామీ ఇచ్చారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  భీమవరంలో జూలై 17వ తేదీ జనవాణి నిర్వహిస్తామని పవన్ తెలిపారు.

Exit mobile version