Site icon Prime9

Pawan Kalyan : ఆ మూవీ లో తన షూటింగ్ కంప్లీట్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

pawan kalyan shoot completed in samudrakhani directing movie

pawan kalyan shoot completed in samudrakhani directing movie

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ డైరెక్షన్ లో #OG సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ ఈ 4 సినిమాలకు సైన్ చేసి ఉన్నాడు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డాడు. హరి హర వీరమల్లు షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి, పవన్ ఇటీవలే వినోదయ సిత్తం రీమేక్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ మూవీలో మెయిన్ లీడ్ చేస్తున్నాడు.

థాంక్యూ గాడ్ (Pawan Kalyan) అంటూ ట్వీట్ చేసిన సముద్రఖని..

దీంతో పవన్ టాకీ పోర్షన్ షూటింగ్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 22న షూటింగ్ మొదలు పెట్టుకున్న చిత్ర యూనిట్ శరవేగంగా పవన్ పాత్రకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు సముద్రఖని.. ‘థాంక్యూ గాడ్, పవన్ కళ్యాణ్ సార్ కి సంబంధించిన షూటింగ్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసాము’ అంటూ ఒక సెట్ లోని పవన్ ఫోటో షేర్ చేశాడు. ఇటీవల ఈ సినిమా సెట్ నుంచి పవన్ అండ్ సాయి ధరమ్ లుక్స్ లీక్ అయిన విషయం తెలిసిందే.

ఇప్పుడు సముద్రఖని షేర్ చేసిన ఫొటోలో కూడా సేమ్ లుక్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ అండ్ బ్యాలన్స్ షూట్ కూడా త్వరగా పూర్తి చేయనున్నారు. ఈ సినిమాని జులై 28న రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించేశారు. కాగా ఈ సినిమాలో నటించే ఇతర యాక్టర్స్ గురించి వివరాలు తెలియాల్సి ఉంది. తమిళంలో ఫామిలీ డ్రామాగా తెరకెక్కిన వినోదయ సిత్తం.. తెలుగులో కూడా అదే జోనర్ లో తెరకెక్కిస్తున్నారా? లేదా? కథలో ఏమన్నా చేంజ్స్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది.

 

ఈ సినిమా కోసం మెగా ఫ్యామిలీ అభిమనులంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సముద్రఖని దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. కాగా ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది ‘వినోదయ సీతమ్’ సినిమా స్టోరీగా తెలుస్తుంది. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేయనుండగా.. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. దీంతో పవన్ దేవుడి పాత్రలో నటించడం ఇది రెండోసారి అవుతుంది. అంతకు ముందు విక్టరీ వెంకటేష్ తో కలిసి చేసిన ‘గోపాల గోపాల’లో.. పవన్ మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. కానీ,అందులో కూడా మోడ్రన్ దేవుడిలానే దర్శనమిచ్చాడు. ఈ మూవీతో మామ – అల్లుళ్ళు ఏ రేంజ్ లో అలరిస్తారో చూడాలి.

Exit mobile version