Site icon Prime9

Janasena Yuvashakthi: మీ నాన్నకే వార్నింగ్ ఇచ్చా.. పంచెలు ఊడేలా తరిమికొడతానని.. నువ్వెంత? – జగన్‌కు పవన్ మాస్ వార్నింగ్

Pawan kalyan mass warning to CM jagan in Janasena Yuvashakthi

Pawan kalyan mass warning to CM jagan in Janasena Yuvashakthi

Janasena Yuvashakthi: నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఎదుర్కొన్న వాడిని, గుర్తు పెట్టుకోండి. ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడే పంచెలు ఊడిపోయేలా తరిమి కొట్టందని చెప్పా.. నన్ను భయపెట్టాలని చూసినా, నాపై దాడులు చేసినా నేను భయపడలేదన్నారు పవన్ కళ్యాణ్. శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో యువత, పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేశారు. ఈ వేదికగా పవన్ కళ్యాణ్ సీఎం జగన్ కి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

పంచలూడేలా కొడతా..

అసలే రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ .. ఇది మూడు ముక్కల ప్రభుత్వం.. ఆయన మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేశారు. జైలుకెళ్లిన ఖైదీ నెంబర్ 6093 కూడా నా గురించి మాట్లాడితే ఎలా? ఖైదీ నంబర్ 6093కి సెల్యూట్ కొట్టడం నా వల్లకాదు.. పోలీసునైతే చచ్చిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  గెలుస్తానో ఓడిపోతానో కాదు.. పోరాటమే తెలుసు.. గెలుస్తావో ఓడిపోతానో కాదు.. పోరాటమే తెలుసన్నారు పవన్ కళ్యాణ్. ఎదవల్ని ఎదుర్కోవడం, గూండాలను తన్నడం తెలుసు.. ఉత్తరాంధ్ర యాత్ర చేసినప్పుడు నా వద్ద, పార్టీ వద్ద డబ్బులు లేవన్నారు.. నాకు సుఖాలమీద. మమకారం లేదు. ఉద్దానంలో సరైన త్రాగునీరు లేఖ రోగులైన వ్యక్తులను చూసాను.. ఉపాధి లేఖ నలిగిపోతున్న. యువతను చూశాన్నారు పవన్.

అలానే ఉత్తరాంధ్ర పోరాటాల గడ్డని, ఇది కళింగాంధ్ర కాదు కలియబడే ఆంధ్ర, తిరగబడే ఆంధ్ర… ఇక్కడి ప్రజలు మౌనంగా ఉంటే ఎలా? మీ ఉపాధి కోసం మీరు నిలదీయకపోతే ఎలా? ఇక్కడి నుంచి ఎందుకు వలస వెళ్లాలి? అని ఆలోచించకపోతే ఎలా? అని కర్తవ్యబోధ చేశారు. “నాకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఉత్తరాంధ్ర గడ్డపైనే నటనలో ఓనమాలు దిద్దుకున్నాను. ఆట, పాట, కవిత, కళ అన్నీ ఉత్తరాంధ్ర నేర్పినవే. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ పాడిన వంగపండు వంటి వారు నాకు స్ఫూర్తి. యే మేరా జహా… ఏ మేరా ఘర్ ఏ మేరా ఆషియా అన్నా గానీ ఆ చైతన్యం నాకు వచ్చింది ఉత్తరాంధ్రలోనే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని భావించే విశాఖ ఉక్కు కార్మికులు నేను నటన నేర్చుకునే సమయంలో నాకు అండగా నిలబడ్డారు” అని వివరించారు.

 

ఇవి కూడా చదవండి:

Janasena Yuvashakthi: జనసేన పార్టీ పెట్టినప్పుడు నా అకౌంట్‌లో ఉన్నది రూ.13 లక్షలే.. పవన్ కళ్యాణ్

Janasena Yuvashakthi: మూడు ముక్కల ప్రభుత్వం.. మూడు ముక్కల ముఖ్యమంత్రి

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

 

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version