Site icon Prime9

Samuthirakani : సముద్రఖనికి బర్త్ డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్.. మా బంగారు అని అంటూ

pawan kalyan and sai dharam tej wishes to samuthirakani behalf his birthday

pawan kalyan and sai dharam tej wishes to samuthirakani behalf his birthday

Samuthirakani : దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటుడుగా, దర్శకుడుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు “సముద్రఖని”. తమిళంతో పాటు తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు సాధించారు. నటుడిగా సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ‘రఘువరన్ బీటెక్’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇందులో ఆయన నటనకు నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. ‘అలా వైకుంఠపురం’, ‘క్రాక్’, ‘ఆకాశవాణి’, ‘భీమ్లా నాయక్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’, ‘సార్’, ‘దసరా’లో నటించారు. కాగా ఇప్పుడు దర్శకుడిగా మారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘వినోదయ సీతమ్’ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది.

ఇదిలా ఉంటే ఈరోజు సముద్రఖని 49 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 1973 ఏప్రిల్ 26న ఆయన చెన్నైలోని, రాజపాలయం, సీతూర్ లో జన్మించారు. తమిళ ఇండస్ట్రీలో 1998 నుంచి యాక్టివ్ గా ఉన్న సముద్రఖని ఫిల్మ్ ఇండస్ట్రిలో తనదైన ముద్ర వేసుకున్నారు. కాగా ఈ మేరకు సముద్రఖనికి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఒక నోట్ రిలీజ్ చేశారు. ఆ నోట్ లో.. ప్రతిభావంతుడైన దర్శకుడు, రచయిత, నటుడు, మా బంగారు గని శ్రీ సముద్రఖనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి అయిన శ్రీ సముద్రఖని మానవ సంబంధాలపై విశ్వాసం ఉన్నవారు. అందుకే ఆయన చిత్రకథల్లో ఆ భావనలు కనిపిస్తాయి. కులరహిత సమాజాన్ని ఆకాంక్షించే వ్యక్తిత్వంతో అటువంటి సమాజం కోసం తపిస్తారు. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. నటుడిగా జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. నేను నటించిన ‘భీమా నాయక్’ చిత్రంలో ఒక ముఖ్య భూమిక పోషించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. శ్రీ మూకాంబికా అమ్మవారి భక్తుడైన శ్రీ సముద్రఖనికి ఆ జగజ్జనని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

 

అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా ‘బ్రిలియంట్ డైరెక్టర్ సమ్రదఖనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు మరింత ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అందరీ ప్రేమను పొందేలా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు సముద్రఖనికి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మెగా అభిమానులు కూడా పవన్ – తేజ్ తో సినిమా చేస్తున్నందుకు వారు కూడా ట్వీట్ ల వర్షం కురిపిస్తున్నారు.  ప్రస్తుతానికి #pksdt అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. కాగా ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ తన షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని జులై 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

Exit mobile version