Site icon Prime9

Prabhas : ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలంటూ నానిని అభినందించిన ప్రభాస్..

pan india star prabhas appreciates nani and dasara movie team

pan india star prabhas appreciates nani and dasara movie team

Prabhas : నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. మార్చి 30వ తేదీన ప్రపంచ  వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా నిలిచింది. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 71 కోట్లు రాబట్టింది. శ్రీకాంత్ ఓదెల నూతన దర్శకుడు అయినప్పటికీ.. అతను తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులతో పాటు, పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇప్పటివరకు నాని నటించిన అన్ని సినిమాల్లోకంటే.. భారీ విజయాన్ని అందుకున్న ఏకైక చిత్రం దసరా అని చెప్పాలి. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. తెలుగుతో పాటు.. తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది. నాని అభిమానులతో పాటు ప్రేక్షకులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కూడా సినిమా బాగుందంటూ అభినందనలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం దసరా సినిమాని పొగిడేస్తున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు నాని దసరా సినిమాని అభినందించగా తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ దసరా సినిమాని ఓ రేంజ్ లో పొగిడేస్తూ పోస్ట్ చేశాడు.

దసరా సినిమా చూశాను.. సినిమా చాలా బాగుంది – ప్రభాస్ (Prabhas)

ఈ మేరకు ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దసరా పోస్టర్ ని షేర్ చేస్తూ.. ఇప్పుడే దసరా సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా చేసినందుకు నానికి నా అభినందనలు. నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, కీర్తి సురేష్, మిగిలిన టీం అంతా బాగా వర్క్ చేశారు. మనం ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలి అని పోస్ట్ చేశారు. దీంతో ప్రభాస్ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ కి నాని స్పందిస్తూ.. ప్రభాస్ అన్న థాంక్స్ అంటూ రిప్లయ్ ఇచ్చాడు. అంతకు ముందు ఈ చిత్రం చూసిన మహేష్ బాబు కూడా దసరా చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ‘దసరా విషయంలో చాలా గర్వంగా ఉంది. సినిమా అద్భుతంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి దసరా టీమ్ అంతా ఫుల్ ఖుషిగా ఉందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం పక్కా అనిపిస్తుంది.

 

Exit mobile version