Site icon Prime9

Pakistani woman arrested: హైదరాబాద్ వచ్చేందుకు ప్రయత్నించిన పాక్ యువతి అరెస్ట్

Hyderabad: పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించిన ఓ యువతితో పాటు ఆమెకు సహాకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని ప్రేమించిన కలీజా నూర్ అనే యువతి పాకిస్తాన్ లోని ఫైసలాబాద్ నుంచి హైదరాబాద్ లో ఉన్న ప్రియుడు అహ్మద్ వద్దకు వచ్చే ప్రయత్నం చేసింది. అయితే యువతిని సైన్యం పట్టుకుని పోలీసులకు అప్పగించింది.

కలీజా నూర్, అహ్మద్ ఇద్దరూ ఆన్ లైన్ లో పరిచయమయ్యారు. మెల్లగా మాటలు కలిసి, ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకుని కలిసి జీవించాలనుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించకపోవడంతో కలీజా నూర్ పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ లోని ఆమె ప్రియుడు అహ్మద్ ఇందుకోసం పెద్ద ప్లానే వేశాడు. సోదరుడు మహమూద్ సహకారంతో ఆమె హైదరాబాదీ అనిపించేలా నకిలీ ఆధార్ సహా ఇతర పత్రాలూ సృష్టించాడు. నేపాల్ మీదుగా ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. కానీ భారత్–నేపాల్ సరిహద్దుల్లో బిహార్ లోని సుర్సంద్ వద్ద ఆ యువతి, అక్రమంగా ఇండియాలోకి రావడానికి సహకరిస్తున్న మరో ఇద్దరు సైన్యానికి పట్టుబడ్డారు. సైన్యం వారిని స్థానిక పోలీసులకు అప్పగించింది.

హైదరాబాద్ కు చెందిన మహమూద్ అహ్మద్ కొంత కాలం సౌదీ అరేబియాలోని ఓ హోటల్ లో పనిచేశాడని, అక్కడ పనిచేసిన నేపాల్ స్నేహితుల సాయంతో కలీజా నూర్ ను అక్రమంగా ఇండియాలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని సుర్సంద్ జిల్లా ఎస్పీ హర్ కిషోర్ తెలిపారు. కలీజా నూర్ కు అవసరమైన నకిలీ ఆధార్, ఇతర పత్రాలను హైదరాబాద్ లోని మహమూద్ అహ్మద్, మరికొందరు కలిసి సృష్టించారని చెప్పారు. కలీజా నూర్ దుబాయ్ మీదుగా నేపాల్ కు చేరుకోగా, అక్కడి నుంచి మహమూద్ తోపాటు జీవన్ అనే వ్యక్తి ఆమెను ఇండియాలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ, సరిహద్దుల్లో పట్టుబడ్డారని తెలిపారు. తొలుత వారు గూఢచారులు కావొచ్చని భావించి ఆ దిశగా దర్యాప్తు చేశామని, కానీ ప్రేమ వ్యవహారంతో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించినట్టు తేలిందని ఎస్పీ చెప్పారు. ఖాదియా, అహ్మద్ తో పాటు వీరికి సహకరించిన నేపాల్ కు చెందిన జీవన్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Exit mobile version