Site icon Prime9

Chinta Mohan: తొలి సంతకం రూ. 500 గ్యాస్ సిలెండర్ ధస్త్రం పైనే..

chinta-mohan

Vijayawada: సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో అవసరమైన గ్యాస్ సిలెండర్ ను రూ. 500లకే అందించే దస్త్రం పైనే కాంగ్రెస్ తొలి సంతకమని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్రాల విధానాల పై ఆయన విరుచుకుపడ్డారు.

పేదల ఆకలి తీర్చేందులో ప్రధాని మోదీ విఫలం చెందారన్నారు. దేశానికి భాజాపా చేసింది ఏమీ లేదని, చీతాలు తెచ్చి ఫోటోలు దిగడమే గొప్పలుగా చెప్పుకొంటున్నారని చింతా ఎద్దేవా చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ, అంబేడ్కర్ ఫోటోలు పెడుతున్నారు సరే, అద్వాని, వాజ్ పేయ్ లు మీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. వారిని గుర్తు చేసుకోవాల్సి అవసరాన్ని కూడా భాజాపా గుర్తించడంలేదని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని పేర్కొన్న చింతా, 2024 లోక్ సభ ఎన్నికల్లో వంద సీట్లే భాజాపా పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు.

ఏపీలో పరిస్ధితులు పూర్తి అద్వాన్నంగా మారాయన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకుంటున్నారని చింతామోహన్ అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ వేదికగా అబద్ధాలు ఆడడం వైకాపాకే చెల్లిందన్నారు. విభజన చట్టంలో పెట్టిన ప్రత్యేక హోదా పై మోసం చేసిన కేంద్రం పై జగన్ ప్రభుత్వం నిలదీయక పోవడానికి కారణం మోదీకి సీఎం జగన్ దత్తపుత్రుడంటూ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ను అబద్దాల రాష్ట్రంగా ఓవైపు, అదాని రాష్ట్రంగా కట్టబెట్టేలా కుట్రలు జరగడం భాదాకరమన్నారు.

విద్య నేర్పించే అయ్యవార్లను బంట్రోత్తులుగా చేసిన ఘనుడుగా సీఎం జగన్ కే చెల్లిందన్నారు. ప్రభుత్వ అసమర్ధత కారణంగా విద్యా, వైద్య రంగాలను నాశనం చేసారని మండిపడ్డారు. ఆసుపత్రుల్లో నర్సులే ఆపరేషన్లు చేస్తున్నారంటే పరిస్ధితి పై ప్రజలు ఇట్టే అర్ధం చూసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ అధికారంలోకి వచ్చాడన్న చింతామోహన్ మరొక్క ఓటు ఛాన్సుతో ఆయన అధికార కుర్చీ దిగడం ఖాయమని మాజీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీని వీడిన గులాం నబీ ఆజాద్ పై కూడా చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టింది గులాంనబీ ఆజాద్ గా పేర్కొన్నారు. వారానికి ఒక్కరోజైనా ప్రధాని మోదీతో టచ్ లో ఉంటాడని విమర్శించాడు. ఉత్తరప్రదేశ్ ను నాశనం చేసింది కూడా ఆయనేనంటూ చింతా ఆజాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version
Skip to toolbar