Site icon Prime9

Swag: 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేసిన శ్రీ విష్ణు కొత్త సినిమా – ఎక్కడ చూడాలంటే!

Latest Swag Movie Released in OTT: హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్‌ కామెడీ థ్రిల్లర్‌ చిత్రం ‘స్వాగ్‌’. రితూ వర్మ హీరోయిన్‌గా మీరా జాస్మిన్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఆక్టోబ‌ర్ 4న థియేటర్లో విడుదలైన మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలో ప్రత్యేక్షమైంది. గతంలో శ్రీవిష్ణు నటించిన హిట్‌ చిత్రం ‘రాజరాజచోర’ మూవీ దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వంలో ప్రమోగాత్మక చిత్రంగా స్వాగ్‌ తెరకెక్కింది. స్త్రీ, పురుషుల సమానత్వం అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు ఏకంగా నాలుగు పాత్రలు పోషించారు.

అయితే అన్ని పాత్రలను చూపించేందుకు స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్‌ తడబడ్డాడు అనిపించింది. కథనం కాస్తా గందరగోళంగా అనిపించడంతో ఆడియన్స్‌ నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ సడెన్‌గా అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. అది కూడా మూవీ విడుదలైన 20 రోజుల్లోనే ఓటీటీకి రావడంతో అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. గురువారం అర్థరాత్రి ఈ చిత్రం సైలెంట్‌ ఆమెజాన్‌లో స్ట్రీమింగ్‌ వచ్చింది. మరి ఈ వీకెండ్‌ ఇంట్లోనే ఏదైన డిఫరెంట్‌ మూవీ చూసి ఎంజాయ్‌ చేయాలనుకుంటే స్వాగ్‌ చూసేయండి. రితూ వర్మ, దక్షా నాగర్కర్‌, మీరా జాస్మిన్‌, సునీల్‌ ప్రధాన పాత్ర పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.

Exit mobile version