Site icon Prime9

Munugodu: కేంద్ర బలగాలతో ఉప ఎన్నికల నిర్వహించండి…ఎస్ఈసీకి భాజపా విజ్నప్తి

Organize by-elections with central forces Munugodu by Poll

Organize by-elections with central forces Munugodu by Poll

BJP: మునుగోడు ఉప ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని, కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరపాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు భాజపా విజ్నప్తి చేసింది. హైదరాబాద్ బుద్ధభవన్ లో ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందచేశారు.

డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఉప ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. భాజపా లో చేరిన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, దీనిపై కూడా ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో అంబులెన్సులు, పోలీసు వాహనాల్లో డబ్బులు సరఫరా చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని భాజపా ప్రతినిధులు కోరారు.

దీనిపై ఎన్నికల అధికారి సానుకూలంగా స్పందించారని ప్రతినిధుల బృందం పేర్కొనింది. ఎస్ఈసీని కలిసిన వారిలో నల్లు ఇంద్రసేనారెడ్డి, దుగ్యాల ప్రదీప్, ప్రకాశ్ రెడ్డి, ఆంటోని రెడ్డితోపాటు తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి:Rajanala Srihari : మద్యం బాటిళ్లను పంచిన టిఆర్ఎస్ నేతలు

Exit mobile version