Site icon Prime9

Kerala: కేరళలో భారీ వర్షాలు.. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

Kerala: కేరళలో వరుసగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని దక్షిణ జిల్లాలో వర్షాలు కాస్తా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వాతావరణశాఖ ఈ రోజు ఎనిమిది జిల్లాలో ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. ఇదుక్కి, త్రిసూర్‌, పలక్కాడ్‌, మల్లాపురం, కోజికోడ్‌, వానియాడ్‌, కన్నూర్‌, కాసర్‌ గాడ్‌ జిల్లాలకు ఈ హెచ్చరికలు వర్తిస్తాయి.

భారీ వర్షాల కారణంగా వర్షాకాలంలో వచ్చే జబ్బుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది కేరళ ప్రభుత్వం. ముఖ్యంగా డెంగ్యూ, డయెరియా, టైఫాయిడ్‌, జాండిస్‌, వైరల్‌ ఫీవర్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హెల్త్‌ డిపార్టుమెంటును అలెర్ట్‌ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మధ్య, ఉత్తర కేరళలోని వేలాది మంది ప్రజలను సురిక్షిత ప్రాంతాలకు తరలించింది. పలు నదుల్లో నీటి మట్టం పెరిగిపోవడంతో అధికారులు డ్యాం షెట్టర్లను ఎత్తివేసి నీటిని వదులుతున్నారు. జులై 31 నుంచి ఇప్పటి వరకు కనీసం 19 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 32 ఆస్తులు పూర్తిగా, 232 ఆస్తులు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.

Exit mobile version