Amigos Movie : నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం “అమిగోస్”.
కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా చేస్తుంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ మూవీతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
కాగా ఈ నెల 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మేరకు ఈరోజు హైదరాబాద్‌లోని జేఆర్సీ వేదికగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు.
అయితే ఈ వేడుక నందమూరి సోదరులు ఇద్దరికీ ఒకే చోట చూసేలా చేయబోతుంది.
కళ్యాణ్ రామ్ అమిగోస్ (Amigos Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్..
కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరినీ ఒకే వేదిక మీద చూడడానికి నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
అంతకు ముందు ‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ఎన్టీఆర్ అతిథిగా వచ్చారు.
ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అదే విధంగా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
‘అమిగోస్’ సినిమాలో రెండు పాటలు విడుదల చేశారు. తొలి పాట ‘యెక యెక…’లో ముగ్గురు హీరోల మధ్య ఫ్రెండ్షిప్ ఆవిష్కరించారు.
రెండో పాట బాలకృష్ణ ‘ధర్మ క్షేత్రం’లో ‘ఎన్నో రాత్రులు వస్తాయి… సాంగ్ ని ‘ రీమిక్స్ చేశారు.
కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ వీడియో సాంగ్ కి అదిరరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
గతంలో బాలకృష్ణ సాంగ్ ని కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాలో రీమిక్స్ చేశాడు.
ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో బాబాయ్, తమ్ముడు సెంటిమెంట్ లతో కళ్యాణ్ రామ్ హిట్ కొట్టడం గ్యారంటీ అని అంతా భావిస్తున్నారు.
కళ్యాణ్ రామ్ గత చిత్రం బింబిసారా మంచి హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఎఫెక్ట్ తోనే ‘అమిగోస్’ నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మేశారని తెలిసింది.
వాటితో బడ్జెట్ రికవరీ అయ్యిందని సమాచారం. ఇప్పుడు థియేట్రికల్ హక్కులను తొమ్మిది కోట్లకు విక్రయించినట్టు తెలుస్తోంది.
సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు విడుదల చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ… భారీ విజయాలు అందుకుంది.
అంతే కాదు… ఆ సినిమాతో డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కూడా లాభాలు అందుకున్నాయి. ఈ మూవీతో అదే జోష్ ని కంటిన్యూ చేయాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరోవైపు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ లెవెల్ లో ఏర్పాట్లు చేశారు. అన్నదమ్ములు ఇద్దరినీ ఒకే వేదికపై చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఈవెంట్ కి హాజరైనట్లు కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మరింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/