Site icon Prime9

NTR FOR OSCARS : ట్విట్టర్ లో ట్రెండింగ్ గా #NTRFOROSCARS.. ఆ టాప్ మీడియా సంస్థ సర్వే కారణంగానే?

ntr for oscars hash tag trending on twitter

ntr for oscars hash tag trending on twitter

NTR FOR OSCARS : భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ లు కలిసి నటించారు.

ఈ మూవీలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌, ఆలియా భట్‌లు కీలక పాత్రల్లో కనిపించారు.

2022 మార్చి 24న రిలీజ్‌ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది.

దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది.

అయితే ఇప్పటకే పలు అంతర్జాతీయ అవార్డులు కైవసం చేసుకున్న ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా మరింత పెంచింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ నట విశ్వరూపం చూపించారని చెప్పాలి.

కాగా ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల్లో ఎన్టీఆర్ పేరు నామినేట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు.

ప్రతియేటా ఉత్తమ నటీనటుల జాబితాను ముందే ప్రెడిక్ట్ చేసే వెరైటీ ఎడిషన్ అనే మ్యాగెజిన్ వారు, 2023కు గాను బెస్ట్ యాక్టర్ అనే విభాగంలో ఆసియా నుండి ఎన్టీఆర్ పేరును ఎంపిక చేశారు.

ఆస్కార్ రేస్ లో ఎన్టీఆర్  టాప్ అంటున్న హాలీవుడ్ ప్రముఖ మీడియా..

అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్‌టీఆర్ ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ రేసులో నిలుస్తారని యూఎస్ఏ టుడే అభిప్రాయపడింది.

ఈ పేపర్ ఓ ఆర్టికల్ ని ప్రచురిస్తూ వారు నిర్వహించిన సర్వే లో ఎన్టీఆర్ పేరు కూడా టాప్ లో వచ్చిందని ప్రకటించారు.

ఆస్కార్ కోసం పోటీ పడేవారిలో అతడు హాటెస్ట్ కంటెండర్ అని స్పష్ట చేసింది.

బెస్ట్ యాక్టర్ విభాగంలో ఓటు వేయడానికి ఆర్ఆర్ఆర్‌లో కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్‌టీఆర్ నటనను అకాడమీ గుర్తించకుండా ఉండదని వెబ్‌సైట్ అంచనా వేసింది.

హాలీవుడ్ హీరోలతో పాటుగా ..

ఇక ఇదే లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు టామ్ క్రూజ్ (‘టాప్ గన్: మావెరిక్’), పాల్ డానో (‘ది బ్యాట్‌మాన్’), మియా గోత్ (‘పెరల్’), నీనా హోస్ (‘తార్’), జో క్రావిట్జ్ (‘కిమీ’), లషానా లించ్ (‘ది ఉమెన్ కింగ్’, ‘మటిల్డా ది మ్యూజికల్’), పాల్ మెస్కల్ (‘ఆఫ్టర్సన్’), కేకే పాల్మెర్ (‘నోప్’) జెరెమీ పోప్ (‘ది ఇన్‌స్పెక్షన్’) వంటి నటీ, నటులు ఉన్నారు.

ఈ టాప్ 10 జాబితాలో ఎన్టీఆర్‌ చోటు దక్కించుకోవడం మామూలు విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు.

అంతేకాదు ఓ భారతీయ నటుడు ఇక్కడి దాకా రావడం కూడా ఇదే మొదటిసారని అంటున్నారు.

దీంతో తారక్‌ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు

దీంతో ఎన్టీఆర్ అభిమానులంతా ఈ విషయన్ని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా లో ట్రెండింగ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ట్విట్టర్ లో #NTRFOROSCARS ట్రెండ్ అవుతుంది.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version