Ntr death anniversary: నేడు ఎన్టీఆర్ 27 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ, లక్ష్మీపార్వతి తదితరులు నివాళులు అర్పించారు.
తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా తారక రామారావు గుర్తింపు పొందారు. నటుడిగా ప్రేక్షకుల చేత.. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా పేరుపొందారు. అనంతరం తెలుగుదేశం పార్టీని స్థాపించి సీఎం అయ్యారు. తెలుగు వారి ఆత్మగౌరవం పేరిట రాజకీయాల్లో సంచలనాలు సృష్టించారు. ఆయన జనవరి 18న 1996లో మరణించారు. నేడు ఆయన 27వ వర్ధంతి.
ఈరోజు తెల్లవారుజామున కళ్యాణ్ రామ్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.
ప్రతి తెలుగు బిడ్డ.. సగర్వంగా ఎన్టీఆర్ పేరు చెప్పుకునేలా చేసిన ఘనతే ఆయనకే చెందుతుందని అన్నారు.
ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేశాయి.
రైతులకు భరోసా ఇచ్చిన వ్యక్తిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోతారు.
పొలిటికల్ పార్టీలో తెలుగుదేశం పార్టీ కు ఉన్న కార్యకర్తలు ఏ పార్టీకి లేరు.
బడుగు బలహీన వర్గాలకి ఎన్టీఆర్ అండగా నిలిచారు.
తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపు.
బాలకృష్ణతో పాటు నివాళులు అర్పించిన నందమూరి సుహాసిని.
అధికారం కొందరి చేతుల్లో నుండి అందరి చేతికి అందించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.
పటేల్ పట్వారీ ని రద్దు చేశారు గొప్ప వ్యక్తి ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ఒక యుగపురుషుడు.. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయరు.
9 నెలల్లో పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ ది.
ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని కోరిన సుహాసిని.
ఎన్టీఆర్ కులమతాలకు అతీతంగా ఎన్టీఆర్ సేవలందించారు.
తెలుగు వారి గుండెల్లో ఆయన గూడుకట్టుకున్నారు.
భారత దేశం గరవించిన వ్యక్తి ఎన్టీఆర్.
రాజకీయంగా గెలిచారు వ్యక్తిగతంగా ఓడిపోయారని లక్ష్మీ పార్వతి విమర్శ.
రాజకీయాల్లో చాణిక్య నీతి పాటించాలని సూచన.
26 సంవత్సరాలుగా ఒంటరిగా బతుకుతున్నానని ఆవేదన.
జగన్మోహన్ రెడ్డి నాకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చారని ప్రకటన.
ఆయన పరిపాలనలో నాలాంటి వాళ్ళకి ఆసరాగా నిలిచారు.
నా భర్త ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి కి అందాలని కోరుకుంటున్నానని లక్ష్మీ పార్వతి అన్నారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/