Site icon Prime9

Nithin: నితిన్‌ కొత్త సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ – ఈ శివరాత్రికి వచ్చేస్తున్న ‘తమ్ముడు’

Thammudu Movie Locks Shivaratri 2025 Release: హీరో నితిన్‌కు ఈమధ్యకాలంలో చెప్పుకోదగ్గ హిట్‌ లేదు. ఒకప్పుడు వరుస హిట్స్‌తో దూసుకుపోయిన ఈ హీరోని ప్రస్తుతం వరసు ప్లాప్స్‌ వెంటాడుతున్నాయి. అయినా ఫలితాలతో సంబంధం లేకుండ వరుస సినిమాలు చేస్తున్నాడు నితిన్‌. చివరిగా ఎక్స్‌ట్రార్డినరి చిత్రంలో డిజాస్టర్‌ చూశాడు. దీంతో ఈసారి ఎలాగైన మంచి హిట్‌ కొట్టడానికి బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలతో రెడీ అయ్యాడు. అలా అతడు నటిస్తున్న చిత్రం తమ్ముడు. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది మూవీ టీం.

ప్రస్తుతం నితిన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో శ్రీలీలతో రాబిన్‌ హుడ్‌ ఒకటి. మరొకటి తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ ‘తమ్ముడు’. చాలా రోజుల క్రితమే నితిన్ ఈ సినిమాను ప్రకటించాడు. ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అక్కడ-తమ్ముళ్ల సెంటిమెంట్‌తో ఈ సినిమా రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ లయ నితిన్‌కు అక్క పాత్రను పోషిస్తుంది. అయితే ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి పెద్దగా అప్‌డేట్స్‌ లేవు. అయితే తాజాగా ‘తమ్ముడు’ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మూవీ నుంచి కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో నితిన్‌ ఓ పాపని ఎత్తుకుని చేతిలో కాగడ పట్టుకుని పరుగెత్తుండగా.. వెనకాల జనం అతడి వెంట పరుగెడుతూ కనిపించారు. ఈ పోస్టర్‌ని రిలీజ్‌ చేస్తూ మహాశివరాత్రి కానుగా తమ్ముడు సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు.

Exit mobile version