Site icon Prime9

Appudo Ippudo Eppudo: నెల తిరక్కుండానే సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన నిఖిల్‌ లేటెస్ట్‌ మూవీ – ఎక్కడ చూడాలంటే..!

Appudo Ippudo Eppudo Movie OTT Streaming: యంగ్‌ హీరో నిఖిల్‌ నటించిన రీసెంట్‌ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. కార్తికేయ 2 వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ తర్వాత నిఖిల్‌ నటించిన చిత్రమిది. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ థియేటర్లోకి వచ్చిన 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేసింది. నవంబర్‌ 8న థియేటర్లోకి రిలీజైంది. అయితే ఈ మూవీ ప్లాప్‌ అవ్వడంలో నెల తిరక్కుండానే డిజిటల్‌ ప్రీమియర్‌కు వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా సైలైంట్‌గా ఓటీటీలో రిలీజైంది.

రిలీజోకు ముందే అమెజాన్ ప్రైం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేసింది. నవంబర్‌ 26 అర్థరాత్రి నుంచి ఈ సినిమా సైలెంట్‌గా అమెజాన్‌ ప్రైంలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమాకు స్వామిరారా దర్శకుడు సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్‌ బీవీఎస్ఎన్‌ ప్రసాద్‌ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో సప్తసాగరాలు హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లుగా నటించారు.

సినిమా కథ విషయానికి వస్తే..

చిన్న‌ప్పటి నుంచి కార్ రేస‌ర్ అవ్వ‌ల‌న్న‌ది రిషి (నిఖిల్‌) కల. అయితే అనుకోకుండా అతడు తార (రుక్మిణి వసంత్‌) అనే అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ కొన్ని కార‌ణ‌ల వల్ల వీరిద్ద‌రికి బ్రేక‌ప్ అవుతుంది. ఆమెతో బ్రేక‌ప్ తర్వాత ఫారిన్‌(లండన్‌) వెళ్లి అక్కడ పార్ట్‌ టైం వర్క్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అక్క‌డ తుల‌సి (దివ్యాంశ కౌశిక్‌) అనే అమ్మాయితో ప‌రిచ‌యం ఏర్ప‌డి మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డతాడు. పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అయితే అంతలోనే తుల‌సి మాయం అవ్వుతుంది. ఆమె ఎక్కడికి వెళ్లింది? తుల‌సిని ప‌ట్టుకోవ‌డానికి రిషి ఏం చేశాడు? బ్రేక‌ప్ చెప్పిన తార మ‌ళ్లీ లండ‌న్‌లో రిషిని ఎలా కలుసుకుంది? అనేది కథ.

Exit mobile version