Site icon Prime9

Swayambhu Movie : యంగ్ హీరో నిఖిల్ “స్వయంభు” మూవీ పోస్టర్ రిలీజ్.. ఇక షూటింగ్ షురూ

new poster released from young hero nikhi swayambhu movie

new poster released from young hero nikhi swayambhu movie

Swayambhu Movie : యంగ్ హీరో నిఖిల్ తనదైన శైలిలో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కార్తికేయ ఇచ్చిన సక్సెస్ తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. ఇటీవల స్పై సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. దీని తర్వాత నిఖిల్ చేతిలో మరో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. వాటిలో రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ‘ది ఇండియా హౌజ్’ ఒకటి. అలానే నిఖిల్ 20వ సినిమాగా వస్తున్న ‘స్వయంభు’ మరొకటి.

కాగా ఇటీవలే  నిఖిల్ పుట్టిన రోజు నాడు స్వయంభు సినిమాని ప్రకటించారు. అర్జున్ సురవరం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఠాగూర్ మధు బ్యానర్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా.. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈరోజు నుంచి సినిమా షూటింగ్ మొదలైందని ప్రకటిస్తూ నిఖిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. యుద్ధభూమిలో బాణాలు వదులుతూ ఉన్న నిఖిల్ పోస్టర్ అదిరిపోయింది అని చెప్పాలి. అలానే  ఈ సినిమాలో గోల్డెన్ లెగ్ మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. పీరియాడిక్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీతో నిఖిల్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

 

 

ఇక నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన (Swayambhu Movie) పోస్టర్ లో ఒక బంగారు రాజదండం కనిపిస్తుంది. అది చూస్తుంటే ఇటీవల కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంలో ఉపయోగించిన ‘సింగోల్’లా కనిపిస్తుంది. ఆ సింగోల్ తమిళనాడు ట్రెడిషన్ అని అందరికీ తెలిసిందే. ఒక రాజు నుంచి మరో రాజుకి అధికారం బదిలీ చేయడాన్ని గుర్తుగా సింగోల్ ని ఉపయోగిస్తారు. దీంతో ఈ పోస్టర్ తో సినిమాపై ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.

ఈ సినిమాలతో పాటు నిఖిల్, తనకి కంబ్యాక్ హిట్ ఇచ్చిన సుధీర్ వర్మతో మరో ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. స్వామిరారా, కేశవ సినిమాలు సుధీర్ వర్మ-నిఖిల్ కాంబినేషన్ లో వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మూడో సినిమా అనౌన్స్ అయ్యింది. మరి ఈ సినిమాల టైం లైన్స్ ఏంటి? ఏ మూవీ ముందు ఆడియన్స్ ముందుకి వస్తుంది లాంటి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Exit mobile version