Happy Birthday Sreeleela : యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లిసందD’ మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తరువాత ‘ధమాకా’ మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో శ్రీలీల టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. అమ్మడికి వరుసగా సినిమా ఛాన్స్‌లు వస్తుండటంతో, శ్రీలీల యంగ్ సెన్సేషన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాలో శ్రీలీల పర్ఫార్మెన్స్, డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇక ఈ బ్యూటీ పర్ఫార్మెన్స్‌కు అందరూ ఇంప్రెస్ కావడటంతో, వరుసబెట్టి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు శ్రీలీలను తమ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తుంది. ఈ క్రమంలోనే ఈరోజు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి తన పోస్టర్ లను మూవీ యూనిట్స్ రిలీజ్ చేశాయి. దీంతో శ్రీ లీల ఫ్యాన్స్ అంతా ఫుల్ గా ఖుషి అవుతూ తనకి బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నేడు శ్రీలీల పుట్టిన రోజు కావడంతో తాజాగా చిత్రయూనిట్ శ్రీలీలకు బర్త్ డే విషెష్ చెప్తూ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో శ్రీలీల పట్టు పరికిణి కట్టి కాళ్లకు నైల్ పాలిష్ పెడుతూ క్యూట్ లుక్ తో చూస్తుంది. ఈ ఫస్ట్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. అదే విధంగా బాలయ్య – అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న “భగవంత్ కేసరి” సినిమాలో కూడా ఈ భామ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. తాజాగా ఈ మూవీలో నుంచి కూడా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు.
తాజాగా అల్లు అర్జున్, శ్రీలీల తో కలిసి ఆహా కొత్తగా ఏదో ప్లాన్ చేయబోతుంది. ఇటీవల త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఉన్న షూటింగ్ స్పాట్ ఫోటోని విడుదల చేసింది ఆహా టీం. ఇప్పుడు తాజాగా శ్రీలీల, అల్లు అర్జున్, కలిసి ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో శ్రీలీల .. అల్లు అర్జున్ పై ఎక్కి కూర్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. అయితే ఇది యాడ్ షూటా లేదా ఆహా కోసం ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా అని అభిమానులు, ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.
అలానే శ్రీలీల.. రామ్ పోతినేని- బోయపాటి కాంబినేషన్ సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. అలానే నితిన్, పంజా వైష్ణవ్ తేజ్ సినిమాలకీ శ్రీలీల సంతకం చేసింది. కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త, కన్నడ మైనింగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమవుతున్న సినిమాలో కూడా నటిస్తుంది.