Site icon Prime9

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కటౌట్‌తో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు.. ‘ఎవడ్రా మనల్ని ఆపేది’

new-marraige-couple-pasting-pawan-kalyan-image-in-flexi

new-marraige-couple-pasting-pawan-kalyan-image-in-flexi

Pawan Kalyan : ఆవేశాన్ని ఆపుకోగలం కానీ అభిమానాన్ని ఆపుకోలేం సార్ , కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు వంటి డైలాగ్ లను నిజం చేసింది ఓ పెళ్లి జంట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకొని అందర్నీ అబ్బురపరిచారు. ఇంతకీ ఆ నవ వధూవరులు ఏం చేశారంటే… గుంటూరు జిల్లా తెనాలిలోని బాలాజీరావు పేటకి చెందిన మాన్యం జగదీష్ కి , రమ్య అనే అమ్మాయి తో పెళ్లి నిశ్చయమైంది. అయితే నేరుగా తమ పెళ్ళికి పవన్ కళ్యాణ్ రాకపోయినా… ఆయన సమక్షంలో పెళ్లి చేసుకోవాలని జగదీష్ ముచ్చట పడ్డాడు. ఈ తరుణంలోనే పవన్ పై అభిమానంతో ఆయన ఫోటోని పెళ్లి బ్యానర్ పై వధూవరులు వేయించుకున్నారు.

పట్టణంలోని ఎన్జీవో కళ్యాణ మండపంలో పెళ్లి సందర్భంగా అభిమాన నవ దంపతులు పవన్ కళ్యాణ్ ఫోటోని వరి మధ్యలో వేయించుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతే కాకుండా ” మన దేవుడు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ” అని రాయించారు. ముఖ్యంగా ఆ ఫ్లెక్సీ లో ” మనల్ని ఎవడ్రా ఆపేది ” అనే డైలాగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పవర్ స్టార్ కి వీరాభిమానులు కావడంతోనే పెద్దలకు చెప్పి, ఒప్పించి మరి ఈ విధంగా చేసుకున్నారని వారి బంధువులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తమకు దేవుడితో సమానం గా భావించి ఆరాదిస్తాముని, జనసేన అభిమానులుగా పెళ్లిలో గుర్తుండి పోయే విధంగా ఉండాలని తమ మధ్య పవన్ కళ్యాణ్ చిత్రాన్ని వేసుకొని తమ అభిమానం చాటుకున్నామని ఆ జంట చెబుతున్నారు.

ఇదీ చదవండి… ప్రతిపక్షనేతలను తిట్టమంటారు.., రైతుల వద్దకు మంత్రులను ఎందుకు పంపరు? .. పవన్ కళ్యాణ్

Exit mobile version