Site icon Prime9

Amaran OTT: ఓటీటీలోకి లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ, రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే

Amaran OTT Release Date Fix: తమిళ హీరో శివ కార్తికేయన్‌, నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి నటించిన లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘అమరన్‌’. తమిళ చిత్రమైన అమరన్‌ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై అద్బుతమైన రెస్పాన్స్‌ అందుకుంది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన అమరన్‌ అక్టోబర్‌ 31న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించింది. విడుదలైన నెల రోజలు దాటిన ఇప్పటికీ అక్కడక్కడ థియేటర్లో ఆడుతూనే ఉంది. రూ. 300 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించిన ఈ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ఇప్పుడు డిజిటిల్‌ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది.

తాజాగా అమరన్‌ ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో వహించిన ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫ్లిక్స్‌ డిజిటల్‌ రైట్స్‌ని సొంతం చేసుకుంది. థియేటర్లో బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు స్ట్రీమింగ్‌కు ఇచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్‌ సిద్ధమైంది. డిసెంబర్‌ 5న అమరన్‌ను ఓటీటీలో రిలీజో చేస్తున్నట్టు తాజాగా ప్రకటన ఇచ్చింది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

కాగా రాజ్‌కుమార్‌ పెరియాసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషన్‌లో ప్రొడక్షన్స్‌, గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై కమల్‌ హాసన్‌, ఆర్ మహేంద్రన్‌ సంయుక్తంగా నిర్మించారు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా దాదాపు రూ. 331 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్‌ తెచ్చిపెట్టిన చిత్రాల జాబితాలో అమరన్‌ కూడా చేరింది. ఈ సినిమాను ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌ అనే పుస్తకంలో మేజర్‌ ‘వరదరాజన్‌’ చాప్టర్‌ ఆధారం తెరకెక్కించారు.

Exit mobile version