Site icon Prime9

NEET Row: నీట్ ఎగ్జామ్ లో ఇన్నర్ వేర్ ల తొలగింపు వివాదం.. ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Kerala: కేరళ కొల్లాం జిల్లాలో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి హాజరయ్యే ముందు తమ ఇన్నర్‌వేర్‌లను తొలగించమని బాలికలను కోరిన సంఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నేషనల్ టెస్టింగ్ ఏజన్సీకి చెందిన ముగ్గురు, కాలేజీకి చెందిన ఇద్దరు ఉన్నారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌ఎస్‌డబ్ల్యూ) తెలిపింది. ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్ రేఖా శర్మ బాలిక విద్యార్థుల ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్‌పర్సన్‌కు లేఖ రాశారు. ఈ విషయంలో న్యాయమైన విచారణ జరపాలని మరియు ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కూడా కమిషన్ కేరళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు లేఖ రాసింది. తీసుకున్న చర్యను 3 రోజుల్లోగా కమిషన్‌కు తెలియజేయాలని ఎన్ సి డబ్ల్యు సూచించింది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) వాస్తవాలను తెలుసుకోవడానికి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసామని దాని నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది. తిరువనంతపురం సమీపంలోని ఆయూర్‌లోని మార్తోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆదివారం జరిగిన పరీక్షలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Exit mobile version
Skip to toolbar