Site icon Prime9

Padi Koushik: బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ఊహించని షాక్.. జాతీయ మహిళా కమిషన్ నోటీసులు

Kaushik Reddy

Kaushik Reddy

Padi Koushik: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. ఈ నేపథ్యంలో.. జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.

పాడి కౌశిక్ రెడ్డికి షాక్.. (Padi Koushik)

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఓ కార్యక్రమంలో ఆయన గవర్నర్ తమిళి సై పలు అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే లేపాయి. దీనిపై మహిళ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఓ మహిళ గవర్నర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని.. మహిళలు నిరసన తెలిపారు. వీటిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటిసులపై పాడి కౌశిక్ రెడ్డి ఇంకా స్పందించలేదు.

గవర్నర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల ఈ నెల 14న నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 21న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. తక్కువ సమయం ఉన్నందున కౌశిక్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు ఈ నోటిసులపై కౌశిక్ రెడ్డి స్పందించలేదు. కొద్ది రోజుల క్రితం.. హుజురాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో.. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ, పెండింగ్ బిల్లుల అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్ వ్యహరిస్తున్న తీరుపై పలు అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్ లో పాస్ చేసిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని అనుచిత పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మహిళ సంఘాలు.. భాజపా నేతలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. ఈ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేశారు.

బీఆర్ఎస్ లో యాక్టివ్ గా పాడి కౌశిక్ రెడ్డి

కొద్దీ రోజులుగా పాడి కౌశిక్ బీఆర్ఎస్ లో చురుగ్గా ఉంటున్నారు. ఇక హుజురాబాద్ టికెట్ పాడి కౌశిక్ రెడ్డికే దక్కుతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరోవైపు కేటీఆర్ కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇది వరకే గవర్నర్‌ తమిళిసై, కేసీఆర్‌ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్‌ను టార్గెట్‌ చేసిన బీఆర్‌ఎస్‌ నేతలు పలు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు కూడా గవర్నర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version