Naravaripalli: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతఊరు నారావారి పల్లె (Naravaripalli )సంక్రాంతి సంబరాలకు ముస్తాబవుతోంది. ప్రతి ఏటా చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం లో సంక్రాంతి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గత మూడేళ్లగా మహమ్మారి కరోనా కారణంగా చంద్రబాబు సొంతూరులో సంక్రాంతికి దూరంగా ఉన్నారు. అయితే ఈసారి మాత్రం సంక్రాంతి పర్వదినాన్ని ఆయన కుటుంబం సభ్యులతో పాటు గ్రామస్థుల మధ్య జరుపుకోనున్నారు. ఈ వేడుకల కోసం నందమూరి కుటుంబం కూడా నారావారి పల్లికి రానుంది. దీంతో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలకు ప్రత్యేకత ఏర్పడింది.
మూడేళ్ల తర్వాత సంబరాల్లో..
మూడు ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) స్వగ్రామానికి రానుండడంతో సంబరాల కోసం భారీగా ఏర్పాటు చేస్తున్నారు. పల్లె లోని ఇంటికి సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. రంగుల రంగుల ముగ్గులతో ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. అదే విధంగా చంద్రబాబు కుటుంబం పర్యటించే ప్రాంతాల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మూడేళ్ల అనంతరం చంద్రబాబు సొంత ఊరిలో పండగ జరుపుకునేందుకు వస్తుండటంతో .. పార్టీ నేతలు , కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్పెషల్ అట్రాక్షన్ గా దేవాన్ష్
సంబరాల్లో పాల్గొనేందుకు ముందుగా ఈ నెల 12 న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి , దేవాన్ష్ నారావారి పల్లెకు చేరుకుంటారు. అనంతరం 13న చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, వసుంధరతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నారా వారి పల్లి కి చేరుకుని సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాడు. నారా కుటుంబం ఆధ్వర్యంలో యువతి యువకుల కోసం పలు రకాల పోటీలను నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి:
శరవేగంగా జియో 5జీ సేవలు.. ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు నగరాల్లో..
ఖమ్మంలో ఊహించని ట్విస్ట్‌లు.. ఫిక్స్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పోతే పోనియండన్న కేసీఆర్
నీ బాయ్ ఫ్రెండ్ అనకొండకి ఏం జరిగిందో నీకు అదే రిపీట్ అవుతుంది.. రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన “కేఆర్కే” !
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/