Site icon Prime9

Nara Rohit: బై నాన్న – తండ్రి మరణంపై నారా రోహిత్‌ ఎమోషనల్‌, పోస్ట్‌ వైరల్‌!

Nara Rohit Emotional on His Father Death: తన తండ్రి మరణంపై హీరో నారా రోహిత్ ఎమోషనల్‌ అయ్యారు. శనివారం(నవంబర్‌ 16) నారా రోహిత్ తండ్రి నారా రామ్ముర్తి నాయుడు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తండ్రికి కన్నీటి విడ్కోలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా తనని తన తండ్రి ఎత్తుకుని ఉన్న చిన్ననాటి ఫోటో షేర్‌ చేస్తూ.. బై నాన్న అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు.

“మీరోక ఫైటర్‌ నాన్న. మీరు నాకు ప్రేమించడం, అలాగే ఫైటర్‌ జీవితాన్ని గెలవడం నేర్పించారు. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మీరే. ప్రజలను ప్రేమిస్తూ.. మంచి కోసం పోరాటం చేయాలని చెప్పారు. మీరు జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. వాటి ప్రభావం మాపై లేకుండా చూసుకున్నారు. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నాన్న.. మీతో ఎన్నో మధురు జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఇంతకంటే ఏం చెప్పలేకపోతున్నా. బై నాన్న” అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ప్రస్తుతం నారా రోహిత్‌ పోస్ట్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. దీనిపై అతడి ఫ్యాన్స్‌, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ధైర్యంగా ఉండు అన్న అంటూ నారా రోహిత్‌కి మద్దతు ఇస్తున్నారు.

కాగా రామ్ముర్తి నాయుడు ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి సొంత తమ్ముడు అనే విషయం తెలిసిందే. కాగా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో గుండెపోటు రావడంలో శనివారం తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మరణ వార్త తెలిసి రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తమ్ముడి విషమ పరిస్థితిలో ఉన్నాడని తెలిసి సీఎం చంద్రబాబు తన మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారు. అక్కడ మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో అక్కడి బీజేపీ పార్టీ సభ్యుడికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవల్సి ఉండగా.. దానిని క్యాన్సిల్‌ చేసుకుని హైదరాబాద్‌ వచ్చారు. ఆయనను నారా వారి పల్లెలో నిన్న అంత్యక్రియలు నిర్వహించారు.

Exit mobile version