Site icon Prime9

Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్రలో ఆసక్తికర ఘటన.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మృతివనానికి నమస్కారం

nara lokesh tributees to ys rajashekar reddy in yuvagalam

nara lokesh tributees to ys rajashekar reddy in yuvagalam

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ “యువగళం” పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా పాదయాత్ర ఆదివారం (మే 14) నాటికి 99వ రోజుకు చేరింది. ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర సాగుతున్న ఈ పాదయాత్రలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నల్లకాలువ పంచాయతీ సమీపంలో నారా లోకేశ్ పర్యటనలో భాగంగా అక్కడే ఉన్న వైఎస్ఆర్ స్మృతి వనం ముందు నుంచి పాదయాత్ర వెళ్తుండగా.. నారా లోకేశ్ కాసేపు అక్కడ ఆగి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మృతి వనానికి నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

మరోవైపు ఈరోజు పాదయాత్రలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గంలోని వెలగాము వద్ద కొత్త రామాపురం గ్రామస్తులతో లోకేశ్ సమావేశం కానున్నారు. తర్వాత తెలుగు గంగ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆ తర్వాత అటవీ కార్యాలయం సమీపంలో స్కిల్డ్ అండ్ స్కిల్డ్ వర్కర్లతో ఫేస్ టు ఫేస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆదివారం (మే 14) సాయంత్రం వెలుగోడులో ఎస్సీలు, బుడగ జంగాలు, స్థానికులతో సమావేశం కానున్నారు. రాత్రికి బోయ రేవుల శివారు విడిది కేంద్రంలో నారా లోకేష్ బస చేయనున్నారు. ఇక మే 15 వ తేదీతో లోకేశ్‌ యువగళం పాదయాత్ర 100 రోజులకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా సోమవారం నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి తెదేపా నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

అదే విధంగా నేడు మాతృ దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన గొప్ప వరం అమ్మ అని అన్నారు. తన తల్లి నారా భువనేశ్వరితో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘ఆమె ప్రేమ షరతులు లేనిది.. ఆమె త్యాగం అసమానమైనది. మన జీవితాల్లో భారాన్ని తగ్గించడానికి ఆమె చేసే కృషి సాటిలేనిది. భగవంతుడు మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన గొప్ప వరం అమ్మ. అన్నింటికీ ధన్యవాదాలు అమ్మా’’ అని ట్వీట్ చేశారు. హ్యాపీ మదర్స్ డే హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.

 

Exit mobile version