Nandamuri Taraka Ratna : ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి మోహన కృష్ణ కుమారుడిగా తారకరత్న 20 ఏళ్ళ వయసులోనే ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. 1983 జనవరి 8న జన్మించిన తారకరత్న.. 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలుపెట్టి..వరల్డ్ రికార్డు సృష్టించారు. ఒకటో నంబర్ కుర్రాడు, యువరత్న సినిమాలు పెర్ఫామెన్స్ పరంగా తారకరత్నకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ తర్వాత తారక్, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, ఎదురులేని అలెగ్జాండర్, మహాభక్త సిరియాళ, కాకతీయుడు, సారథి లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.
ఇక అమరావతి, రాజా చెయ్యివేస్తే చిత్రాలలో విలన్‌గా మెప్పించిన తారకరత్న.. 2009 లో అమరావతి చిత్రానికి బెస్ట్ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు. ఇటీవలే 9 అవర్స్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు తారకరత్న.
నాలుగేళ్లు కుటుంబానికి దూరం (Nandamuri Taraka Ratna)..
అనంతపురం జిల్లాకు చెందిన మధుసూదన్‌రెడ్డి కుమార్తె. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మేనకోడలును తారక్ పెళ్లాడాడు. తారకరత్న హీరోగా నటించిన ‘నందీశ్వర’ సినిమాకు అలేఖ్యరెడ్డి కాస్టూమ్ డిజైనర్‌గా పని చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెళ్లి అయి విడాకులు తీసుకున్న అలేఖ్యను పెళ్లి చేసుకోవడానికి ఇరు కుటుంబీకులు ఆమోదించలేదు. దీంతో వారిద్దరూ 2012 ఆగస్టు 2న హైదరాబాద్‌లోని సంఘీ టెంపుల్‌లో వివాహం చేసుకున్నారు. 2013 డిసెంబర్ 21 వీరిద్దరికి పాప జన్మించింది. ఆ అమ్మాయికి.. నిష్క అని నామకరణం చేశారు. 2014లో జరిగిన తన సోదరి రూప పెళ్లికి కూడా తారకరత్న వెళ్లలేకపోయాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
2016 లో తారకరత్న పుట్టినరోజు సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు వెళ్లి సెలబ్రేట్ చేశారు. అప్పటి నుంచి మళ్లీ తారకరత్న నందమూరి కుటుంబంలో కలిసిపోయాడు. ఇటీవల.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లోనూ తారకరత్న చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. లోకేష్ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా కుప్పం వెళ్లి మరీ అన్నీ తానై చూసుకున్నారు. ఇదిలా ఉండగా.. పార్టీ నేతలను కూడా కలుపుకుని పోతున్నారు. ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సీటు కేటాయించాలని భావించారు. తారకరత్న టీడీపీ తరపున గతంలో ప్రచారం కూడా చేశారు. నందమూరి కుటుంబంలో వివాదాలకు దూరంగా ఉండే హీరోగా తారకరత్నకు పేరుంది. ఇప్పుడు తారకరత్న ఇంత త్వరగా దూరమవడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న శనివారం తుది శ్వాస విడిచారు. తారక రత్న మృతదేహాన్ని బెంగులూరు నుంచి హైదరాబాద్ లోని తన నివాసానికి తరలించారు. ఈ నేపథ్యం లోనే తారక రత్న భౌతిక దేహాన్ని సందర్శించుకోవడానికి సినీ, రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరికి మోకిల చేరుకుంటున్నారు. చిన్న వయసులోనే తారక రత్న మరణం చాలా బాధకరం అన్న బాబు.. ఆయన కుటుంబానికి ఎళ్లవేళలా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మృత్యువుతో పోరాడి చనిపోవడం బాధాకరం అన్నారు. చిన్న వయసులోనే ఎక్కువ సినిమాల్లో నటించిన తారక రత్న అమరావతి మూవీకి నంది అవార్డు అందుకున్నారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీచేయాలనే ఆలోచనలో తారక రత్న ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/