Site icon Prime9

Nagarjuna Akkineni: జైనాబ్‌ రవ్‌జీతో అఖిల్‌ నిశ్చితార్థం – వివాహం ఎప్పుడో చెప్పిన నాగార్జున

Nagarjuna on akhil marraige

Nagarajuna About Akhil Marraige: అక్కినేని ఇంట వరుసగా పెళ్లి భాజాలు మోగనున్నాయి. అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్‌లు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. డిసెంబర్‌ 4న చై నటి శోభిత దూళిపాళతో ఏడుగులు వేయబోతున్నాడు. వీరిద్దరి పెళ్లి ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉన్న క్రమంలో అఖిల్‌ ఎంగేజ్‌మెంట్‌ ప్రకటన ఇచ్చి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశాడు కింగ్‌ నాగార్జున. జైనాబ్‌ రవ్‌జీ అనే అమ్మాయితో అఖిల్‌ నిశ్చితార్థం జరిగింది. అనంతరం ఫోటోలు షేర్‌ చేస్తూ చిన్న కోడలిని పరిచయం చేశాడు నాగ్‌.

అయితే జైనాబ్‌ ఎవరూ? ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ గురించి చెప్పలేదు. ఇది ఇప్పటికీ హాట్‌టాపిక్ గానే ఉంది. అయితే తాజాగా ఓ మీడియా చానల్‌తో మాట్లాడిన నాగ్ నిఖిల్‌ నిశ్చితార్థంపై స్పందించాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమంటూ ఆనందం వ్యక్తం చేశాడు. “ఈ సంవత్సరం నాన్న గారికి శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. మరోవైపు చై, అఖిల్‌ కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. డిసెంబర్‌ 4న నాగచైతన్య-శోభిత పెళ్లి జరగనుంది. అన్నపూర్ణ స్టూడియో ఈ వేడుకలకు వేదిక అవ్వడం సంతోషంగా ఉంది. మరోవైపు అఖిల్‌ కూడా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాడు.

జైనబ్‌ రవ్‌జీ చాలా మంచి అమ్మాయి. అఖిల్‌ జీవితాన్ని ఆమె పరిపూర్ణం చేస్తుందని నమ్ముతున్నా. తను ఇతరుల పట్ల ఎంతో ప్రేమ, అభిమానంతో ఉంటుంది. వారిద్దరు కలిసి జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు ఆనందంగా ఉంది. జైనాబ్‌ రవ్‌జీ అక్కినేని కుటుంబానికి బాగా నచ్చింది. తనని మా కుటుంబంలో సంతోషంగా స్వాగిస్తున్నాం. వచ్చే ఏడాది వారి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం” అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. కాగా నవంబర్‌ 26న అఖిల్‌, జైనాబ్‌ రవ్‌జీ నిశ్చితార్థం జరిగినట్టు నాగార్జున ప్రకటించారు. ఇరు కుటుంబసభ్యులు సమక్షంలో వారి నాగార్జున నివాసంలో ఈ వేడుక జరిగింది.

జైనబ్‌తో అఖిల్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని తెలియజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కోడలిగా జైనబ్‌ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ కాబోయే జంటకు మీ ఆశీస్సులు కావాలి” అని పేర్కొన్నాడు. కాగా జైనాబ్‌ రవ్‌జీ ప్రముఖ పెయింటర్‌. అలాగే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌ కూడా. హైదరాబాద్‌లో పుట్టిన ఆమె ముంబై, దుబాయ్‌లో పెరిగింది. లండన్‌లో చదువు పూర్తి చేసింది. ఆమె తండ్రి జుల్ఫీ రవ్‌జీ, నాగార్జుల మధ్య మంచి స్నేహం ఉందని తెలుస్తోంది. దాంతో ఇరుకుటుంబాలు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం జైనాబ్‌, అఖిల్‌కి పరిచయం ఏర్పడగా.. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. ఇక జైనాబ్‌ అఖిల్‌ కంటే 9 ఏళ్లు పెద్దది అనే టాక్‌ వినిపిస్తుంది.

Exit mobile version