Site icon Prime9

Kubera First Glimpse: ఒక్క డైలాగ్‌ లేకుండా ‘కుబేర’ గ్లింప్స్‌ – ఆసక్తి పెంచుతున్న నాగార్జున, ధనుష్‌ పాత్రలు

Kubera First Glimpse Release: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంతో తమిళ స్టార్‌ హీరో ధనుష్‌, నాగార్జులు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. మల్టీస్టారర్‌గా వస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్‌ ఇండియాగా విడుదల కాబోతోన్న ఈ సినిమాను అమిగోస్‌ క్రియేషన్స్‌, శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్లపై సునీల్‌ నారంగ్‌, పుష్కూర్‌ రామ్మోహన్‌ రావులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్‌ మూవీపై బజ్‌ క్రియేట్‌ చేశాయి. అంతేకాదు ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ గ్లింప్స్‌ విడుదల చేసి ఆకట్టుకున్నారు.

ఇక తాజాగా ఈ సినిమాలో ఫస్ట్‌గ్లింప్స్‌ రీలీజ్‌ చేసింది మూవీ టీం. ప్రస్తుతం ఈ గ్లింప్స్‌ ఆడియన్స్‌ మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఒక్క డైలాగ్‌ లేదు.. కేవలం సీన్స్‌తోనే గ్లింప్స్‌ రిలీజ్‌ చేసి ఆకట్టుకుంది టీం. నాగార్జున ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడం, ఆ తర్వాత సముద్ర తీరం నుంచి నడుచుకుంటు వెళ్లడం.. ఆ తర్వాత మొత్తం డబ్బు కట్టలు నిండి ఉన్న రూంలో నాగార్జున నిలిచుని కనిపించారు. మరోవైపు ధనుష్‌ గుబురు గడ్డం, మాసిన బట్టలతో రోడ్డుపై పరుగెడుతూ కనిపించాడు. ఎయిర్‌పోర్టు సీన్స్‌, ప్లైయిట్స్‌ ఇలా కొన్ని సీన్స్‌ అయితే చాలా రిచ్‌గా కనిపించాయి. ఇక చివరిలో తెల్లటి పంచకట్టులో ధనుష్‌ సాధారణ వ్యక్తిలా కనిపించడం ఆసక్తిగా అనిపించింది. పూర్తి సస్పెన్స్‌తో సాగిన గ్లింప్స్‌ సినిమాపై మరింత బజ్‌ క్రియేట్‌ చేస్తుంది.

Kubera Glimpse (Telugu) | Dhanush, Nagarjuna, Rashmika | Sekhar Kammula | Devi Sri Prasad

Exit mobile version
Skip to toolbar