Site icon Prime9

Kubera:’కుబేర’.. నాగార్జున కొత్త లుక్‌తో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన టీం – ఫస్ట్‌గ్లింప్స్‌ రిలీజ్‌ ఎప్పుడంటే!

Kubera First Glimpse Release Date: కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌, టాలీవుడ్ కింగ్‌ నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. నేషనల్‌ అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌, అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్స్‌పై సునీల్‌ నారంగ్‌ పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావులు నిర్మిస్తున్నారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. లవ్‌స్టోరీ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రం తర్వాత శేఖర్‌ కమ్ముల రూపొందిస్తున్న చిత్రమిది. పైగా ధనుష్‌, కింగ్‌ నాగార్జున ఒకే స్క్రీన్ షేర్‌ చేసుకోబోతుండటంతో మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్‌, గ్లింప్స్ మూవీపై బజ్‌ క్రియేట్‌ చేశాయి. ముఖ్యంగా బిచ్చగాడి గెటప్‌లో ఉన్న ధనుష్‌ లుక్‌ కుబేరపై ఆసక్తిని రెకేత్తిస్తోంది.

ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అప్‌డేట్స్‌ పెద్దగా రావడం లేదు. దీంతో అభిమానులంతా కుబేర్‌ అప్‌డేట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో మేకర్స్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఈ సినిమాలో ఫస్ట్‌గ్లింప్స్‌ రెడీ చేసి విడుదలకు సిద్ధంగా చేస్తున్నట్టు తాజాగా ఓ ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున లుక్‌ కొత్త లుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది టీం. నవంబర్‌ 15న కుబేర్‌ ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు వెల్లడించింది.

ఈ కొత్త పోస్టర్‌లో నాగార్జున కూల్‌ లుక్‌లో కనిపించారు. కాగా ఈ సినిమాలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈమే ఆఫిషికల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ అవ్వగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ధనుష్‌, నాగార్జున గ్లింప్స్‌ కూడా బాగా ఆకట్టుకుంది. వర్షంలో తడుస్తూ గొడుగు పట్టుకుని కింగ్‌ నాగార్జున కూల్‌గా కనిపించారు. బ్యాగ్‌లో అతడు డబ్బు పెడుతూ కనిపించిన మరో పోస్టర్‌ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version