Site icon Prime9

Thandel: నాగ చైతన్య ‘తండేల్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన మూవీ టీం – వచ్చే ఏడాది ఆ రోజున విడుదల

Thandel Release date

Thandel Release Date Announced Officially: తండేల్‌ రిలీజ్‌ ఎప్పుడు? తండేల్‌ రిలీజ్‌ ఎప్పుడు? గత కొద్ది రోజులుగా సినీ ప్రియుడుల, అక్కిని ఫ్యాన్స్‌ని తొలిచేస్తున్న ప్రశ్న. డిసెంబర్‌ 20న మూవీ రిలీజ్‌ అని ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాని వాయిదా వేశారు. అప్పటి నుంచి తండేల్‌ రిలీజ్‌లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. కానీ మూవీ టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. దీంతో తండేల్‌ సంక్రాంతికి వచ్చేస్తుందంటూ ఓ ప్రచారం మొదలైంది. కాదు కాదు.. ఫిబ్రవరి 14న అంటూ మరో కొత్త రిలీజ్‌ డేట్‌ తెరపైకి వచ్చింది. కానీ, దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ లేదు.

అలా తండేల్‌ రిలీజ్‌పై విషయంలో అందరు డైలామాలో పడిపోయారు. దీంతో స్వయంగా మూవీ టీం రంగంలోకి దిగి తండేల్‌ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది. ఇందుకోసం మూవీ టీం ప్రత్యేకంగా రిలీజ్‌ డేట్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్నీ వాసు, డైరెక్టర్‌ చందు మొండేటితో పాటు హీరోహీరోయిన్‌ నాగ చైతన్య, సాయి పల్లవిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. తండేల్‌ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేశారు. అందరు అనుకున్నట్టుగా మేం పండగకు వస్తామని చెప్పలేదు. ఎవరికి వారే తొచిన డేట్‌ని అనుకుంటున్నారు. దీంతో మాలో టెన్షన్‌ మొదలైంది. డిసెంబర్‌ 20న రిలీజ్‌ చేస్తామని చెప్పాం.. కానీ అనుకోని కారణాల వాయిదా వేశాం.

కానీ సంక్రాంతి తండేల్‌ని రిలీజ్‌ చేస్తామని మేము ఎక్కడ కూడా హింట్‌ ఇవ్వలేదు. కానీ తండేల్‌ రిలీజ్‌ ఇదేనంటూ మూడు వారాలుగా ప్రచారం జరుగుతుంది. అందుకే ఇలా ప్రత్యేకంగా ప్రెస్‌మీట్‌ పెట్టి తండేల్‌ విడుదల తేదీని ప్రకటించడానికి డైరెక్టర్‌, హీరోహీరోయిన్‌తో సహా మీ ముందుకు వచ్చాం” అల్లు అరవింద్‌ స్పష్టం చేశారు. అనంతరం చిన్న వీడియోతో మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. వచ్చే ఏడాది 2025 ఫిబ్రవరి 7న తండేల్‌ విడుదల చేస్తున్నట్టు బిగ్‌స్క్రీన్‌పై ప్రకటన ఇచ్చింది మూవీ టీం. ఇక తండేల్‌ రిలీజ్‌పై స్పష్టత రావడంతో ఫ్యాన్స్‌ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ సారి గట్టి కంబ్యాక్‌ ఇవ్వడానికి చై ఫిబ్రవరిలో సోలోగా వస్తున్నాడు.

కాగా నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్డ్స్‌ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు తండేల్‌ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. 2018 గుజరాత్‌లో జరిగిన నిజజీవిత సంఘటన ఆధారం ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఇందులో నాగ చైతన్య రాజు అనే మత్స్యకారుడిగా కనిపించడనున్నాడు. రా అండ్‌ రస్టిక్‌ లవ్‌స్టోరీ, దేశభక్త నేపథ్యంలో ఈ సినిమాను సాగనుంది. ఇక పాన్‌ ఇండియా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version