Site icon Prime9

Mohan Babu: ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం – మోహన్‌ బాబు ఎమోషనల్ పోస్ట్‌

Mohan babu Tweet

Mohan Babu Tweet Viral: ప్రస్తుతం మంచు ఫ్యామిలీకి ఆస్తి వివాదాలని, తండ్రికొడుకుల(మోహన్‌ బాబు- మనోజ్‌) మధ్య ఘర్షణలు జరిగాయంటూ ఓ వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్తి విషయంలో మనోజ్, మోహన్‌ బాబుకి మధ్య గొడవ జరిగిందని, తన తండ్రి దాడి చేశాడంటూ మనోజ్ పోలీసులను ఆశ్రయించినట్టు ఈ రోజు ఉదయం ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియదు. కానీ మంచు మోహన్‌ బాబు పీఆర్‌ టీం ఈ వార్తలను ఖండించింది. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసినా.. ఈ రూమర్స్‌ ఆగడం లేదు. ఈ క్రమంలో మోహన్‌ బాబు ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశాడు.

మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ ట్వీట్‌ ఆసక్తిగా మారింది. ఇంతకి ఆ ట్వీట్‌లో ఏముందంటే.. ఆయన నటించిన ఓ సినిమాను గుర్తు చేసుకుంటూ మోహన్‌ బాబు ఎమోషనల్‌ అయ్యారు. ఒకప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా, హీరోగా మోహన్‌ బాబు తన నటనతో ఆకట్టుకున్నారు. తనదైన నటన, డైలాగ్‌ డెలివరితో హీరో అవకాశాలు అందుకున్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కెరీర్‌ స్టార్‌ చేసిన ఆయన నటుడిగా ఒక్కొక్కొ మెట్టు ఎక్కుతూ స్వయంకృషితో స్టార్‌ హీరోగా ఎదిగారు. పాత్ర ఏదైనా, డైలాగ్‌ ఎంతపెద్దదైనా సింగిల్ టేక్‌లో చెప్పేస్తారు. ఎంతపెద్ద డైలాగ్‌ అయినా గుక్కతిప్పుకోకుండా ఫాస్ట్‌గా చెప్పేస్తారు.

ముఖ్యంగా పౌరాణిక కథల్లోని డైలాగ్స్‌కు ఆయన పెట్టింది పేరు. అందుకే ఆయనకు డైలాగ్‌ కింగ్ అనే బిరుదు కూడా ఉంది.  ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండ తన ప్రతిభతో ఎదిగిన నటుల్లో మోహన్‌ బాబు ఒకరు. ఇక ఆయన సినీ కెరీర్‌ గురు ఎవరంటే ఎప్పుడు దాసరి నారాయణరావు అని చెబుతున్నారు. ఆయన దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమాలన్ని దాదాపు హిట్స్‌, సూపర్‌ హిట్స్‌ అయ్యాయి. అయితే అందులో ఓ సినిమాను గుర్తు చేసుకుంటూ మోహన్‌ బాబు ఓ క్లిప్‌ షేర్‌ చేశారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో 1979లో తెరకెక్కిన చిత్రం కోరికలే గుర్రాలైలేతే. ఇందులో ఓ సీన్‌లో మోహన్ బాబు యమధర్మ రాజు పాత్ర పోషించారు.

ఈ సీన్‌కి సంబంధించిన క్లిప్‌ని షేర్‌ చేస్తూ.. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌ తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని మధుర జ్ఞాపకాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సన్నివేశం తన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. “నా గురువు, లెజెండరి శ్రీ దాసరి నారాయణరావు గారు దర్శకత్వంలో శ్రీ జి. జగదీష్‌ చంద్ర ప్రసాద్‌ గారు నిర్మించిన ఈ చిత్రం కొరికలే గుర్రాలైతే(1979). ఈ చిత్రంలోని ఈ సీన్‌ నా కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఇందులో చంద్ర మోహన్‌, మొరళీ మోహన్‌ గార్లతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగాఉంది. తొలిసారి మయధర్మ రాజు పాత్ర పోషించడం మర్చిపోలేని అనుభూతి. ఈ సీన్‌ నాకు సవాలుతో పాటు సంతోషాన్ని కూడా ఇచ్చింది. నా కెరీర్‌ ఎంతో ఆదరణ పొందిన చిత్రాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది” అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Exit mobile version