Site icon Prime9

Mohan Babu: ఆ ఘటనపై పశ్చాత్తాపం చెందుతున్న, క్షమించండి – మోహన్‌ బాబు బహిరంగ లేఖ

Mohan Babu Apology

Mohan Babu apologises Media: ప్రముఖ నటుడు మోహన్ బాబు మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఓ లేఖ విడుదల చేశారు. ఇందులో జర్నలిస్ట్‌పై దాడి ఘటన పశ్చాత్తాపం చెందుతున్నానన్నారు. తన వల్ల మీడియా ప్రతినిథి గాయపడ్డటంపై చింతిస్తున్నానని, ఈ విషయమై హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానంటూ ఓ పత్రిక ప్రకటన ఇచ్చారు. ఈ పరిణామాల మధ్య అస్వస్థతకు గురైన మోహన్‌ బాబు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రెండు రోజుల చికిత్స అనంతరం ఆయన నిన్న గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మీడియాను క్షమాపణలు కోరుతూ బహిరంగ లేఖ విడుదల చేశారు. “ఇటీవల మా ఇంట్లో జరిగిన అనూహ్య పరిణామాలు నేపథ్యంలో చోటుచేసుకున్న ఓ అనూహ్య సంఘటన పట్ల తీవ్ర వేదనకు గురవుతూ నేను ఈ లేఖ రాస్తున్నాను. మా కుటుంబంలోని వ్యక్తిగత కలతలు బహిర్గతం అవ్వడం నన్ను ఎంతో బాధకలిగించింది. దీని వల్ల నేను తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. ఈ క్రమంలో నా వల్ల జర్నలిస్ట్‌ సోదరుడు గాయపడటం నన్ను ఎంతగానో బాధిస్తుంది. ఈ సంఘటన పట్ల నేను ప్రశ్చాతాపం చెందుతున్నాను. దీనికంటే ముందు నేను ఒకటి చెప్పాలి. ఈ ఘటన తర్వాత నేను అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. 48 గంటలు ఆస్పత్రిలోనే ఉండటం వల్ల ఈ ఘటనపై వెంటనే స్పందించలేకపోయాను. ఆ రోజు నా ఇంటి గేటు విరిగిపోయింది.

దాదాపు 50 మంది వరకు వ్యక్తులు నా ఇంట్లోకి బలవంతంగా చోరబడ్డారు. ఆ ఒత్తిడిలో నేను సహనాన్ని కోల్పోయాను. ఈ గందరగోళం మధ్య మీడియా ప్రతినిధులు అనుకోకుండా వచ్చారు. అప్పటికే అలసిపోయి ఉన్న నేను అనుకొని పరిస్థితుల్లో జర్నలిస్ట్‌ సోదరుడిని గాయపరిచాను. ఈ విషయమై నేను పశ్చాత్తాపడుతున్నాను. అతడికి, అతడి కుటుంబానికి ఇబ్బంది కలిగించినందుకు నా హృదయపూర్వంగా క్షమాపణలు కోరుతున్నా. టీవీ9 రిపోర్టర్‌ రంజిత్‌ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా” అంటూ లేఖలో రాసుకొచ్చారు. కాగా గత వారంలో రోజులుగా మంచు ఫ్యామిలీలు గొడవలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి.

ఈ క్రమంలో మంగళవారం ఈ గొడవలు తారస్థాయికి చేరాయి. ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కడంలో మీడియా ప్రతినిథులంతా అక్కడికి చేరుకున్నారు. మనోజ్‌, మోహన్‌ బాబు అనుచరులు ఒకరినినొకరు తొసుకున్నారు. అదే సమయంలో ఇంటి బయటకు వచ్చిన మోహన్‌ బాబు టీవీ9 రిపోర్టర్‌పై దాడి చేశారు. మైక్‌ లాక్కుని దానితో అతడిని గాయపరిచారు. ఈ ఘటనలో మూడు చోట్ల అతడికి గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావంతో అతడు ఆస్పత్రిలో చేరారు. దీంతో మోహన్‌ బాబు తీరు మీడియా సంఘాలు భగ్గుమన్నాయి. వెంటనే మోహన్‌ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కూడా మోహన్‌ బాబుపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మోహన్‌ బాబు మీడియాను క్షమాపణలు కోరారు.

Exit mobile version