Site icon Prime9

Delhi Excise Scam: కేసీఆర్ కూతురును కాబట్టే ఆరోపణలు.. ఎమ్మెల్సీ కవిత

cbi-to-record-mlc kavita-statement-today-in-delhi-liquor-case

cbi-to-record-mlc kavita-statement-today-in-delhi-liquor-case

Hyderabad: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తాను ఉన్నానంటూ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్‌ కూతురును కాబట్టే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత కాలంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమేనని కవిత అన్నారు.

కేసీఆర్ కుమార్తెను కాబట్టే తనను లక్ష్యంగా చేసుకొని బద్నాం చేస్తున్నారని కవిత అన్నారు. కేంద్రం చేతిలో అన్ని దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, కావాలంటే దర్యాప్తు చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. తమది పోరాటాల నేపథ్యం అని, తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని తెలిపిన కవిత వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇలాంటి ఆరోపణలతో మానసికంగా కుంగిపోతాను అనుకుంటే పొరపాటేనని అన్నారు.

ఏం జరిగినా కేసీఆర్‌ వెనక్కి తగ్గరు. ఆయన పోరాటం ఆపరు. దేశ అభివృద్ధి కోసం కేసీఆర్‌ ప్రతిక్షణం ఆలోచిస్తున్నారు. విచారణ సంస్థలు, మీడియాను అడ్డం పెట్టుకుని మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కవిత పేర్కొన్నారు.

Exit mobile version