Site icon Prime9

Nimmala Rama Naidu: పాలకొల్లులో అల్లూరి విగ్రహానికి అవమానం.. పాలతో శుభ్రం చేసిన ఎమ్మెల్యే రామానాయుడు

Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో నిన్న అర్ధరాత్రి కొంతమంది దుండగులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మట్టి పూయడం వివాదాస్పదంగా మారింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అల్లూరి విగ్రహాన్ని పాలతో విగ్రహాన్ని శుభ్రం చేశారు.

అల్లూరి విగ్రహానికి మట్టి పూయడమనేది భారత జాతికి జరిగిన అవమానం అన్నారు. స్వేచ్ఛ వాయువులు ప్రసాదించిన మహానీయుడు. దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన త్యాగధనుడు వ్యక్తి అల్లూరి అని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఇటువంటి ఘటన జరగడం దారుణమన్నారు. నిందితులపై దేశద్రోహం కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version